ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎస్ఈసీ, రేపు ఉదయం 10 గంటలకు నిమ్మగడ్డ ప్రెస్ మీట్
ఏపీ పంచాయతీ ఎన్నికల పంచాయితి ఒక కొలిక్కివచ్చింది. జగన్ సర్కార్ వర్సెస్ ఎన్నికల సంఘం అన్నట్టుగా సాగిన వ్యవహారంలో చివరికి నిమ్మగడ్డ..
ఏపీ పంచాయతీ ఎన్నికల పంచాయితీ ఒక కొలిక్కివచ్చింది. జగన్ సర్కార్ వర్సెస్ ఎన్నికల సంఘం అన్నట్టుగా సాగిన వ్యవహారంలో చివరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైపే ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ మొగ్గుచూపుతూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా సైతం ఊపింది. దీంతో స్థానిక పోరుకు ఎన్నికల సంఘం చకచకా రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా రేపు ఏపీలో పంచాయతీ ఎన్నిక మొదటి దశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఎస్ఈసీ. అంతేకాదు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలను రేపు ఉదయం 10గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి ప్రకటించనున్నారు. కాగా, నిన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ ఆయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తో చర్చించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని గవర్నర్ కు నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఎన్నికలను అడ్డుకునేందుకు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు పావులు కదుపుతోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు పంచాయితి, జగన్ సర్కార్ Vs ఎస్ఈసీ, కోర్టు వాడి ప్రశ్నలు, వేడి సమాధానాలు, ఫుల్ స్టోరీ