Andhrapradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2021-22 అక‌డ‌మిక్ ఇయ‌ర్ ఆరో తరగతి ప్రవేశానికి కోవిడ్ నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగిస్తూ..

Andhrapradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
Ap Schools
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 02, 2021 | 2:33 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2021-22 అక‌డ‌మిక్ ఇయ‌ర్ ఆరో తరగతి ప్రవేశానికి కోవిడ్ నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగిస్తూ.. ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 30 తేదీలోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. విశాఖ జిల్లాలో చీడికాడ, నర్సీపట్నం, రావికమతం, కశింకోట, మునగపాక మండలాల్లో ఐదు పాఠశాలలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయా పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధన ఉంటుంది. ఆయా పాఠశాలల్లో ఆరు నుంచి ఇంటర్ వరకు ఉచిత బోధన చేస్తారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం.. ఆయా మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి.

ప్రవేశానికి అర్హతలు..

  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2007 నుంచి 01-08-2011 మధ్య జన్మించి ఉండాలి.
  • ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2009 నుంచి 31-08-2011 మధ్య జన్మించి ఉండాలి.
  • గ‌వ‌ర్న‌మెంట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మూడేళ్లు చదవాలి. ప్రస్తుతం 2020-21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్నవారు అర్హులు.
  • దరఖాస్తులు http://www.cse.ap.gov.in/apms.ap.gov.in వెబ్​సైట్​లో జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. రుసుం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ రూ.50లు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆరో తరగతిలో ప్రవేశాలు ఈ ఏడాది లాటరీ ద్వారా చేస్తారు.
  • రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయింపు ఉంటుంది.

Also Read: పొద‌ల్లోని కుందేలుపై డేగ స‌డ‌న్ అటాక్… ఆ త‌ర్వాత ఏమైందో మీరే చూడండి

మంచిర్యాలలో గుప్త నిధుల కలకలం.. విచిత్రంగా పసుపు, కుంకుమ‌తో ముగ్గు వేసి