Treasure Hunt: మంచిర్యాలలో గుప్త నిధుల కలకలం.. విచిత్రంగా పసుపు, కుంకుమ‌తో ముగ్గు వేసి

మంచిర్యాలలో గుప్త నిధుల కలకలం రేగింది. జిల్లాలో ఏదో ఒక చోట గుప్త నిధుల తవ్వకాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. పోలీసుల కళ్లు గప్పి...

Treasure Hunt: మంచిర్యాలలో గుప్త నిధుల కలకలం.. విచిత్రంగా పసుపు, కుంకుమ‌తో ముగ్గు వేసి
Treasurehunt
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 02, 2021 | 10:16 AM

మంచిర్యాలలో గుప్త నిధుల కలకలం రేగింది. జిల్లాలో ఏదో ఒక చోట గుప్త నిధుల తవ్వకాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. పోలీసుల కళ్లు గప్పి గుప్తనిధుల వేట కొనసాగిస్తున్నాయి ముఠాలు. గుప్త నిధుల కోసం జరిపే తవ్వకాల్లో చారిత్రక ప్రదేశాలు, పురాతన ఆలయాలు ధ్వంసం అవుతున్నాయి. తాజాగా గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ, తవ్వకాలు జరిపే ముఠాను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తవ్వకాలకు వెళ్తున్న సమయంలో పక్కా సమాచారంతో కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉండగా ఒకరి పరార‌య్యారు. నిందితుల నుంచి ఒక ఆటో, పూజ సామాగ్రి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కొంచవెళ్లి మహేష్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడానికి వెళుతున్నట్టు విచార‌ణ‌లో నిందితులు తెలిపారు. వారి సెల్ పోన్లోని వీడియోల ఆధారంగా నెన్నెల, దహెగాం, కన్నెపల్లి పరిధిలో గత కొంత కాలంగా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్టుగా గుర్తించారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో టాస్క్‌ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ లచన్న, సిబ్బంది సంపత్, శ్యామ్‌సుందర్, సదానందమ్ గౌడ్, వెంకటేష్, శ్రీనివాస్, బాస్కర్ గౌడ్, రాకేశ్, ఓంకర్ పాల్గొన్నారు.

Also Read: భార్యకు క‌రోనా పాజిటివ్.. భ‌ర్త ఏం చేశాడో మీరే చూడండి

జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. అనాథ పిల్ల‌ల‌కు బీమా ఉన్నా రూ. 10 లక్షల పరిహారం