AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: పొద‌ల్లోని కుందేలుపై డేగ స‌డ‌న్ అటాక్… ఆ త‌ర్వాత ఏమైందో మీరే చూడండి

సోషల్ మీడియాలో రోజూ అడవి జంతువులు, పక్షులకు సంబంధించిన ర‌క‌ర‌కాల వీడియోలు స‌ర్కులేట్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని ఆహ్లాదాన్ని క‌లిగిస్తే.. మ‌రికొన్ని...

Shocking Video: పొద‌ల్లోని కుందేలుపై డేగ స‌డ‌న్ అటాక్... ఆ త‌ర్వాత ఏమైందో మీరే చూడండి
Falcon Attack On Rabbit
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2021 | 12:29 PM

Share

సోషల్ మీడియాలో రోజూ అడవి జంతువులు, పక్షులకు సంబంధించిన ర‌క‌ర‌కాల వీడియోలు స‌ర్కులేట్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని ఆహ్లాదాన్ని క‌లిగిస్తే.. మ‌రికొన్ని గ‌గుర్పాటుకు గురిచేస్తాయి. తాజాగా ఓ ప్ర‌మాద‌క‌ర ప‌క్షికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది. డేగ‌..ఇదో వేగవంతమైన, శక్తివంతమైన పక్షి..ఆకాశంలో అత్యంత ఎత్తులో ఎగురుతూ నేలపై ఎరను గమనిస్తుంది. తనకు కావాల్సిన ఆహారం కనిపించగానే అంతే వేగంతో ఒక్కసారిగా నేలకు దిగి ఎరను పట్టేస్తుంది. తాజాగా వైర‌ల్ అవుతున్న వీడియోలో ఆకాశంలో విహరిస్తున్న ఓ డేగ.. అడవిలో సంచరిస్తున్న ఓ కుందేలును చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు కిందకు దిగింది. కానీ, కుందేలు జ‌స్ట్ మిస్ అయ్యింది. ఎంతో చాకచక్యంగా ఆ డేగ‌ రెక్కల నుంచి, కాళ్ల పంజా నుంచి ఇట్టే తప్పించుకుంది. మరోమారు కూడా డేగ‌ కుందేలును పట్టేందుకు ప్ర‌య‌త్నించ‌గా..రెక్కల మధ్యలోంచి ఒక్కసారిగా జంప్ చేసి… పొదల్లో దూరి తృటిలో ప్రాణాలతో బయటపడింది కుందేలు. నోటికి అందిన ఆహారం చేయిజారిపోయిందే అనుకుంటూ..ఆ రాబంధు నిరాశతో వెనుదిరిగింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. డేగ వేగం, కుందేలు చాకచక్యం చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఈ వీడియో ట్విట్టర్‌లో లైఫ్ అండ్ నేచర్ అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. నెటిజ‌న్ల‌పై ఈ వీడియోపై త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా ఉందని ఒక వినియోగదారుడు రాసుకొచ్చాడు. నేను దీన్ని చూసి నిజంగా ఆశ్చర్యపోయాను అని మరొక యూజర్ రాసుకొచ్చాడు. ఈ రెండింటి మధ్య ఈ క్యాచ్-క్యాచ్ గేమ్ నాకు నచ్చిందని మ‌రొక‌రు పేర్కొన్నారు.

Also Read: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. అనాథ పిల్ల‌ల‌కు బీమా ఉన్నా రూ. 10 లక్షల పరిహారం

తెలంగాణ‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసే అవకాశం

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్