సబ్బం నోరు అదుపులో పెట్టుకోవాలి : బొత్స
సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీనేత సబ్బంహరి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయనాయకులు సమాజంలో గౌరవంగా, పద్దతిగా ఉండాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని బొత్స సూచించారు. తన వ్యాఖ్యలతోనైనా సబ్బంహరి పశ్చాత్తాపం చెందాలని మంత్రి బొత్స అన్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేతపై సబ్బం వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పిన బొత్స.. చట్టం తన పని తాను చేస్తుందని వెల్లడించారు. కాగా, పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ విశాఖలోని తన ఇంటి ప్రహరీని […]
సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీనేత సబ్బంహరి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయనాయకులు సమాజంలో గౌరవంగా, పద్దతిగా ఉండాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని బొత్స సూచించారు. తన వ్యాఖ్యలతోనైనా సబ్బంహరి పశ్చాత్తాపం చెందాలని మంత్రి బొత్స అన్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేతపై సబ్బం వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పిన బొత్స.. చట్టం తన పని తాను చేస్తుందని వెల్లడించారు.
కాగా, పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ విశాఖలోని తన ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేసిన ఘటనను టీడీపీ నేత సబ్బం హరి శనివారం తీవ్రస్థాయిలో ఖండించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఆయన పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నేనేంటో విజయసాయికి తెలియదు.. 24 గంటల్లో మ్యాటర్ క్లోజ్ చేస్తా’ అన్నారు. తానేంటో ముఖ్యమంత్రి జగన్ కు తెలుసనీ, విజయసాయికి తన గురించి తెలియదనుకుంటానని హరి చెప్పుకొచ్చారు. విశాఖలో కూర్చొని ఏదో చేద్దామనుకుంటే సాధ్యమయ్యే విషయం కాదని.. విశాఖలో డ్యాన్స్ చేద్దామని అనుకుంటున్నారని… ఆయన డ్యాన్స్ ని కట్టిస్తానని సబ్బం అన్నారు. తన గురించి తెలియక ఏదో చేద్దామనుకుంటున్నారని… ఈ తప్పు ఎందుకు చేశానా? అని బాధ పడే స్థాయికి తీసుకెళ్తానని సవాల్ విసిరారు సబ్బం హరి. ఇది లీగల్ గా వెళ్లేంత పెద్ద విషయం కాదని… 24 గంటల్లో సమస్యను క్లోజ్ చేస్తానని కూడా సబ్బం హరి వ్యాఖ్యానించిన నేపథ్యంలో బొత్స పైవిధంగా స్పందించారు.