రికార్డు నెలకొల్పే ప్రయత్నంలో టీవీ ప్రజంటర్‌గా జెఫ్ ఐజన్‌బర్గ్ దుర్మరణం

స్పోర్ట్స్ న్యూట్రీషన్ కంపెనీ మ్యాక్సీమసల్ వ్యవస్థాపకుడు, ప్రముఖ టీవీ ప్రజంటర్‌గా జెఫ్ ఐజన్‌బర్గ్ ఒక ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

రికార్డు నెలకొల్పే ప్రయత్నంలో టీవీ ప్రజంటర్‌గా జెఫ్ ఐజన్‌బర్గ్ దుర్మరణం
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 04, 2020 | 12:17 PM

స్పోర్ట్స్ న్యూట్రీషన్ కంపెనీ మ్యాక్సీమసల్ వ్యవస్థాపకుడు, ప్రముఖ టీవీ ప్రజంటర్‌గా జెఫ్ ఐజన్‌బర్గ్ ఒక ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బ్రిటీష్ ల్యాండ్ స్పీడ్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మాగ్జిమస్కిల్‌ను ప్రారంభించిన జెఫ్ ఐసెన్‌బర్గ్, యార్క్ సమీపంలోని ఎల్వింగ్టన్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడ్డ జెఫ్ ఐజన్‌బర్గ్ అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే 2016లో జెఫ్ ఐజన్‌బర్గ్ పెద్ద ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో అతనికి 11 ఎముకలు విరిగిపోయాయి. అక్కడ 2006 లో మాజీ టాప్ గేర్ ప్రెజెంటర్ రిచర్డ్ హమ్మండ్ కూడా ప్రమాదానికి గురై కుప్పకూలిపోయాడు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం జెప్ ఐజన్ బర్గ్ టీవీ ప్రజంటర్‌గా ఎంతో పేరొందారు. ఐ టీవీ కోసం స్పీడ్ ఫ్రీక్స్ అనే షో నిర్వహిస్తున్నారు. మిస్టర్ ఐసెన్‌బర్గ్ మాడ్‌మాక్స్ రేస్ టీమ్‌ను నడిపించాడు. 2019 లో, మిస్టర్ ఐసెన్‌బర్గ్ వేల్స్‌లోని పెండిన్ సాండ్స్‌లో “ఫ్లయింగ్ మైలు” రికార్డును నెలకొల్పాడు. నటుడు ఇడ్రిస్ ఎల్బా చేతుల మీదుగా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. కాగా, జెఫ్ ఐజన్‌బర్గ్ మృతిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.