ఏపీలో కరోనా ప్రపంచ రికార్డులు..!
కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలం చెందిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏపీలో 7,13,014 కరోనా కేసులు, 5941 మరణాలు సంభవించి, దేశంలో 2 వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఇదే జగన్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే లక్ష పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందన్న ఆయన.. ఇలా.. ఒక్క జిల్లాలోనే లక్ష కేసులు నమోదు అవటం ప్రపంచంలో ఎక్కడా లేదని రామకృష్ణ చెప్పారు. […]
కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలం చెందిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏపీలో 7,13,014 కరోనా కేసులు, 5941 మరణాలు సంభవించి, దేశంలో 2 వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఇదే జగన్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే లక్ష పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందన్న ఆయన.. ఇలా.. ఒక్క జిల్లాలోనే లక్ష కేసులు నమోదు అవటం ప్రపంచంలో ఎక్కడా లేదని రామకృష్ణ చెప్పారు.
విజయనగరం జిల్లాలో 27 మంది, గుంటూరులో 14 మంది విద్యార్థులకు కరోనా సోకిందని.. కరోనా కట్టడి చేయకపోగా వైన్ షాపులకు, బార్లకు అనుమతినిచ్చి కరోనా మరింత వ్యాప్తికి కారణమయ్యారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్రజారోగ్యానికి తిలోదకాలిచ్చిన జగన్ ప్రభుత్వం కేవలం ఆదాయ మార్గాలను, అప్పుల దారులను మాత్రమే వెతుకుతోందని ఎద్దేవాచేశారు. కేంద్ర బృందం ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించాలని ఈ సందర్భంగా రామకృష్ణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.