శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడ్డ వజ్రాభరణాలు, బంగారం..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఓ కొరియర్ పార్సిల్‌లో భారీగా వజ్రాభరణాలు, బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడ్డ వజ్రాభరణాలు, బంగారం..
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 04, 2020 | 12:46 PM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా ముంబై కి తరలించేందుకు పంపిన కొరియర్ లో భారీగా వజ్రాభరణాలు, బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఎయిర్‌పోర్టు కార్గో నుంచి ముంబైకు పంపాల్సిన ఓ పార్సిల్‌లో కార్గో సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో గోల్డ్ మాఫియా గుట్టు రట్టు చేశారు అధికారులు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఎయిర్ కార్గో లో ఎయిర్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ల బృందంతో తనిఖీలు చేపట్టారు. ముంబాయికి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగం పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా భారీ స్మగ్లింగ్ బయటపడింది. పార్సిల్‌ను గుర్తించిన అధికారులు అది విప్పగా అందులో మొత్తం 21 కిలోల బంగారం లభించింది. అందులో 19 కిలోల నగలు, ఆభరణాల రూపంలో ఉండగా మిగతా రెండు కిలోలు కడ్డీల రూపంలో ఉన్నాయి. దాదాపు రూ. 30 కోట్ల పై బడి వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

వజ్రాభరణాలు, బంగారానికి పై నుండి వెండి పూత పూసి గుర్తుపట్టకుండా అమర్చి తరలించే ప్రయత్నం చేసింది గోల్డ్ మాఫియా.ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టులో ఇంత భారీ ఎత్తున బంగారం పట్టుబడడం ఇదే తొలిసారి. కస్టమ్స్‌ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, శ్రీపాల్ జైన్ ముంబాయి అడ్రస్‌కి పంపుతున్నట్టు. అశోక్ అనే వ్యక్తి నుండి పార్సల్ పై ఫ్రమ్ అడ్రస్ ఉండడం విశేషం.