ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలను ఫిక్స్.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స..

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలను ఫిక్స్.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్..
AP-Government-
Follow us

|

Updated on: May 01, 2021 | 12:52 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స ధరలను ఖరారు చేస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రులకు ఒక ధర, అక్రిడేషన్ లేని హాస్పిటల్స్ కు మరో ధరను నిర్ణయించింది.

NABH అక్రిడేషన్ కలిగిన ఆసుపత్రులు నం క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) కోసం రూ. 4000, అక్రిడేషన్ లేని ఆసుపత్రులు రూ. 3600 వసూలు చేయాలని ఆదేశించింది. కాగా, NABH అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రులు, లేని ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స రేట్లు ఇలా ఉన్నాయి…

NABH అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రుల్లో రేట్లు ఇలా(రోజుకు)…

  • నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) – రూ. 4000
  • నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ తో) – రూ. 6500
  • ఐసీయూలో చికిత్స అందిస్తే  – రూ. 12,000
  • క్రిటికల్ కేర్ (ఐసీయూ + వెంటిలేటర్) – రూ. 16,000

అక్రిడేషన్ లేని ఆసుపత్రుల్లో రేట్లు ఇలా(రోజుకు)…

  1. నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) – రూ. 3600
  2. నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ తో) – రూ. 5850
  3. ఐసీయూలో చికిత్స అందిస్తే  – రూ. 10,800
  4. క్రిటికల్ కేర్ (ఐసీయూ + వెంటిలేటర్) – రూ. 14,400

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లోనే అన్ని ఫీజులు ఉంటాయని.. ఆసుపత్రులు కోవిడ్ రోగులను వెంటనే చేర్చుకోవాలని తెలిపింది. అలాగే కరోనా బాధితుల నుంచి ఎలాంటి అడ్వాన్స్  లు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అటు సీటీ స్కాన్ కు రూ. 3 వేలు, రెమెడిసివిర్ ఇంజెక్షన్ వైల్ కు రూ. 2,500, టాక్లిజూమబ్ కు రూ. 30 వేలు మాత్రమే వసూలు చేయాలని సూచించింది. కాగా, ఈ ధరల పట్టికను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రదర్శించాలని ఏపీ సర్కార్ వెల్లడించింది.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

 కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!

Latest Articles
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే