Inhumanity: కర్నూలు జిల్లాలో అమానుషం.. కరోనా వచ్చిన తల్లిదండ్రులను ఆసుపత్రిలో చేర్చించి మాయమైన కొడుకులు.. వైద్య సిబ్బంది ఏం చేశారంటే?
కర్నూలు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. అడ్డాల నాడు బిడ్డలు కానీ, గడ్డాల నాడు కాదు అన్న సామెత్ మరోసారి రుజువైంది. కన్న తల్లిదండ్రుల పట్ల కొడుకుల కర్కశత్వం మరోసారి బయటపడింది.
Inhumanity in Kurnool: కర్నూలు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. అడ్డాల నాడు బిడ్డలు కానీ, గడ్డాల నాడు కాదు అన్న సామెత్ మరోసారి రుజువైంది. కన్న తల్లిదండ్రుల పట్ల కొడుకుల కర్కశత్వం మరోసారి బయటపడింది. తల్లిదండ్రులకు కరోనా వచ్చిందని తెలియడంతో కొడుకులు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. తమపై కొడుకులు చూపిస్తున్న ప్రేమను చూసి ఆ తల్లిదండ్రులు పొంగిపోయారు. మంచి వైద్యం అందుతుందని సంబరపడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లా దౌలతబాద్‌కు చెందిన జీవి నారాయణ, సాంసన్ రాజు తల్లిదండ్రుల ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే, ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకువస్తామని వెళ్లి జాడలేకుండా పోయారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఈ విషయానికి సంబంధించి తల్లిదండ్రులు మృతి చెందారని వారికీ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు ఆసుపత్రి సిబ్బంది. అయితే, కొడుకు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. వారి కొడుకుల కోసం ఎదురుచూసిన ఆస్పత్రి సిబ్బంది.. వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సిబ్బందే రెండు మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.
Read Also… Corona: కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!