నేడు అంతర్రాష్ట్ర సర్వీసులపై రానున్న క్లారిటీ..!

ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జూన్ 18వ తేదీ నుంచి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ..

  • Updated On - 9:31 am, Tue, 27 October 20
నేడు అంతర్రాష్ట్ర సర్వీసులపై రానున్న క్లారిటీ..!

Inter State RTC Services: ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జూన్ 18వ తేదీ నుంచి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇవాళ జరగబోయే భేటీతో ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

రెండు రాష్ట్రాలూ చెరో 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పుకోవాలని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించగా.. దానికి ఏపీఎస్ఆర్టీసీ అంగీరికించింది. అయితే ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన ప్రతిపాదనలపై తెలంగాణ పలు మార్పులు సూచించింది. ఈ మధ్యలో దసరా సెలవులు రావడంతో అది కాస్తా ఆలస్యం అయింది. దీనితో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏయే మార్గాల్లో సర్వీసులను తిప్పాలన్న దానిపై ఇవాళ స్పష్టత రానుంది.

Also Read:

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..

లాక్‌డౌన్‌లో బ్యాంకు ఈఎంఐలు చెల్లించారా? అయితే క్యాష్‌బ్యాక్‌ మీ సొంతం!