AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో భారత్‌కు రానున్న మరో 3 రాఫెల్ జెట్స్

భారత వైమానిక దళానికి మరో అదనపు బలం చేకురనుంది. త్వరలో మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదలో వచ్చి చేరనున్నాయి.

త్వరలో భారత్‌కు రానున్న మరో 3 రాఫెల్ జెట్స్
Balaraju Goud
|

Updated on: Oct 28, 2020 | 3:30 PM

Share

భారత వైమానిక దళానికి మరో అదనపు బలం చేకురనుంది. త్వరలో మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదలో వచ్చి చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు నవంబర్ 5న భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. ఇవి ఫ్రాన్స్ నుంచి నేరుగా అంబాలా విమానాశ్రయానికి చేరుకుంటాయి. గత జూలై 29న అబు దబీ మీదుగా 5 రాఫెల్స్ జెట్లు భారత్‌కు చేరుకున్నాయి. సెప్టెంబర్ 10న అంబాలా ఎయిర్‌బోస్‌లో ఈ ఐదు రాఫెల్ జెట్లను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లె, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. 2016లో జరిగిన రూ.59,000 కోట్ల ఒప్పందం ప్రకారం భారత్‌కు 36 రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ అప్పగించాల్సి ఉంది. 2021 ఏప్రిల్‌ నాటికి మరో 16 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు రానున్నాయి. ఈ 16 ఓమ్ని-రోల్ రాఫెల్ జెట్ ఫైటర్లను 2021 ఏప్రిల్‌లో గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఫ్రాన్స్‌లోని అతిపెద్ద జెట్ ఇంజన్ తయారీదారు సఫ్రాన్ సైతం ఇండియాలో ఫైటర్ జెట్లు, విడిభాగాల తయారీకి తాము సిద్ధమేనని చెబుతోంది.

Follow Us