Scrub Typhus: వామ్మో.. ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. ఇప్పటి వరకు ఎంతమంది మరణించారంటే?
ఏపీలో స్క్రబ్ టైఫస్ విశ్వరూపం దాలుస్తోంది. రోజురోజుకు స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,806 పాజిటీవ్ కేసులు నమోదు కాగా సుమారు 15 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ మరణాలకు స్క్రబ్ టైఫస్‌తోపాటు దీర్ఘకాలిక, ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణమని వైద్యులు నిర్ధారించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా రాష్ట్రవ్యాపత్ంగా ఇప్పటి వరకు సుమారు 15 మంది మరణించారు. ఈ ఏడాది జన వరి 1 నుంచి ఈ నెల 17 వరకు రాష్ట్రంలో మొత్తం 9,236 మందికి పరీక్షలు నిర్వహించగా..1,806 పాజిటీవ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ఈ మరణాలకు స్క్రబ్ టైఫస్తో పాటు దీర్ఘకాలిక, ఇతర అనారోగ్య సమస్యలు కారణమని వైద్యులు నిర్ధారించారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి
ఇక రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 444 పాజిటివ్ కేసులు నమోదు కాగా కాకినాడ జిల్లాలో 183, విశాఖ 143, వైఎ స్సార్ కడప 118, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 113, విజయనగరం 96, తిరుపతి జిల్లా 90, గుంటూరు జిల్లా 85, అనంతపురం జిల్లాలో 83 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.
ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారు
ఇక రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అనుమానిత మరణాలు ఏ జిల్లాలో ఎన్ని నమోదయ్యాయో అనే విషయానికి వస్తే.. ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో మూడు, విజయనగరం, బాపట్ల జిల్లాలో రెండు కృష్ణా జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాల్లో రెండు మరణాలు సంభవించాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అన్నమయ్య, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లో ఒకటి చొప్పున మరణాలు నమోదయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








