ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!
Andhra Pradesh Government: అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా కానుక వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం ద్వారా గొర్రెల, మేకల కాపరులకు ఆర్ధికంగా సాయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో కాపరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుక్కోవడానికి ఆర్ధిక చేయూతను ఇవ్వనుంది. ‘వైఎస్సార్ కాపరి బంధు’ పేరుతో అమలు కానున్న ఈ కొత్త పథకానికి నేషనల్ కో […]
Andhra Pradesh Government: అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా కానుక వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం ద్వారా గొర్రెల, మేకల కాపరులకు ఆర్ధికంగా సాయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఒక్కో కాపరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుక్కోవడానికి ఆర్ధిక చేయూతను ఇవ్వనుంది. ‘వైఎస్సార్ కాపరి బంధు’ పేరుతో అమలు కానున్న ఈ కొత్త పథకానికి నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) సహకారం అందించనుంది. అటు యూనిట్ల కొనుగోలుకు మంజూరు చేసే రుణంలో 30 శాతం సబ్సిడీ కూడా ఇవ్వాలని యోచిస్తోంది. 20 గొర్రెలు, ఒక పొట్టేలు వెరిసి ఒక యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు రూ. 1.5 లక్షల రుణాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.
నాలుగు సంవత్సరాలకు సుమారు 50 వేల మంది( సంవత్సరానికి 12,500 మంది చొప్పున) లబ్దిదారులకు ప్రయోజనం కలిగే విధంగా ఈ స్కీంను రూపొందించారు. తొలుత ఈ పథకానికి రూ. 200 కోట్లు కేటాయించేందుకు ఎన్సీడీసీ అంగీకారం తెలిపిందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ పశు నష్ట పరిహారం, రాజన్న పశు వైద్యం వంటి పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
For More News:
సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!
కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే.!
రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?
కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…
ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమేనా ఫస్ట్ లవ్ః ప్రదీప్