AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!

Coronavirus Scare: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్రంలోని విద్యాసంస్థలు అన్నీ కూడా ఈ నెల 31వరకు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సీఈఎస్) చైర్మన్ నాగటి నారాయణ తప్పుబట్టారు. కరోనా విషయంలో భయం లేదంటూనే.. మరోవైపు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 17 […]

సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!
Ravi Kiran
|

Updated on: Mar 15, 2020 | 3:33 PM

Share

Coronavirus Scare: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్రంలోని విద్యాసంస్థలు అన్నీ కూడా ఈ నెల 31వరకు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సీఈఎస్) చైర్మన్ నాగటి నారాయణ తప్పుబట్టారు. కరోనా విషయంలో భయం లేదంటూనే.. మరోవైపు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 17 రోజుల పాటు సెలవులు ప్రకటించడం సరైన నిర్ణయం కాదన్నారు.

కరోనా వైరస్‌తో మృతి చెందిన వారికి 45 సంవత్సరాలు పైబడిన వయసు ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే పిల్లలకు కరోనా సోకినట్లు కేసులేవీ కూడా లేవు. కరోనా నుంచి రాష్ట్రం సురక్షితంగా ఉందని చెబుతూ.. ఇన్ని రోజులు సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది.? పదో తరగతి పరీక్షలు యధాతధంగా జరుగుతాయని చెప్పినప్పుడు.. ఆ పిల్లలకు కరోనా సోకదని భరోసా ఇవ్వగలరా.? ఈ 17 రోజులూ పిల్లలు ఇంట్లో ఉంటే టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం తప్ప వాళ్లకు మరే ఏవగేషన్ ఉండదు. అటు మధ్యాహ్న భోజనం లేకపోతే బాధపడే విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి మరోసారి అన్ని విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు సీఈఎస్ చైర్మన్ నాగటి నారాయణ తెలిపారు.

కాగా, కరోనా వైరస్ తెలంగాణాలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, థియేటర్ల్‌ను బంద్ చేసింది. అయితే మార్చి 19 నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చెప్పారు.

For More News:

ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే.!

రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమేనా ఫస్ట్ లవ్ః ప్రదీప్

భారత్‌లో సెంచరీ దాటిన కరోనా కేసులు.. అత్యధికం మహారాష్ట్ర..

కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!