కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

COVID 19: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి భారత్‌ను కాపాడుకోవడానికి కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 ప్రభావం భారత్‌లో సెకండ్ స్టేజిలో ఉందని అంటున్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత కీలకంగా మారుతుందన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని దశలుగా పరిగణనలోకి తీసుకున్న వాళ్లు.. ఇక్కడితో ఆపేయడానికి పక్కా వ్యూహరచనను చేస్తున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో మొదటిగా ప్రారంభమైన ఈ వైరస్.. డ్రాగన్ కంట్రీని దారుణంగా […]

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 15, 2020 | 3:35 PM

COVID 19: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి భారత్‌ను కాపాడుకోవడానికి కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 ప్రభావం భారత్‌లో సెకండ్ స్టేజిలో ఉందని అంటున్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత కీలకంగా మారుతుందన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని దశలుగా పరిగణనలోకి తీసుకున్న వాళ్లు.. ఇక్కడితో ఆపేయడానికి పక్కా వ్యూహరచనను చేస్తున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో మొదటిగా ప్రారంభమైన ఈ వైరస్.. డ్రాగన్ కంట్రీని దారుణంగా దెబ్బతీసింది. ఇక ఇప్పుడు చైనా పరిస్థితులే భారత్‌లో కూడా కనిపించే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అభిప్రాయపడుతోంది.

ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో స్టేజిలో ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారికి.. వారితో సంబంధం ఉన్నవారికి మాత్రమే ఈ వ్యాధి సంక్రమించింది. ఈ చర్యను ముందుగానే గమనించిన కేంద్రం దానికి తగ్గట్టుగానే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. అయితే ఈ వైరస్ వ్యాప్తి చైనాలో మాదిరిగానే భారత్‌లో కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. కరోనా మహమ్మారి సమూహావ్యాప్తి దశకు చేరుకునేందుకు కేవలం 30 రోజులు మాత్రమే ఉందని ఆయన తెలిపారు.

అందువల్ల ప్రస్తుతం ఉన్న కీలకదశలోనే కరోనా వైరస్‌ను అడ్డుకోగలిగితే.. రాబోయే రోజుల్లో సమూహావ్యాప్తికి చేరకుండా అడ్డుకోవచ్చని భార్గవ అభిప్రాయపడ్డారు. వైరస్ బారిన పడ్డ వ్యక్తికి దూరంగా ఉన్నా.. కరోనా ప్రభావం ఉన్న దేశాలకు వెళ్లకపోయినా కోవిడ్ 19 సోకినట్లయితే దాన్ని సమూహావ్యాప్తి దశకు చేరుకోవడం అని అభివర్ణిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా వైరస్ నాలుగు దశల్లో విజృంభిస్తుంది…

  • ఈ మహమ్మారి కరోనా నాలుగు దశల్లో విజృంభిస్తుందని ఐసీఎంఆర్ నిపుణులు తెలియజేస్తున్నారు.
  • మొదటి దశ – విదేశాల నుంచి స్థానికంగా ప్రవేశించడం…
  • రెండో దశ – వైరస్ సోకిన వ్యక్తి దగ్గర నుంచి సోకడం..
  • మూడో దశ – సమూహావ్యాప్తి
  • నాలుగో దశ – మహమ్మారిగా మారడం
  • ఇక భారత్ ప్రస్తుతం రెండో దశలో ఉంది. ఈ దశలోనే వైరస్‌కు అడ్డుకట్ట వేయాలి. లేదంటే మూడో దశలోకి చేరుకుంటే కష్టతరం అవుతుందన్నారు.

కాగా, ప్రస్తుతం ఇటలీ, చైనా, అమెరికా, యూరప్‌ లాంటి దేశాలు మూడో దశను ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. అయితే భారత్ మాత్రం మూడో దశ నుంచి తప్పించుకునేందుకు ఇంకా అవకాశముందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భారతీయ శాస్తవేత్తలు ఈ కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

For More News:

ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!

సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!

రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమేనా ఫస్ట్ లవ్ః ప్రదీప్

భారత్‌లో సెంచరీ దాటిన కరోనా కేసులు.. అత్యధికం మహారాష్ట్ర..

కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!