కరోనా మహమ్మారిని యోగాతో ఎదుర్కోవచ్చంటున్న రాందేవ్..!
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను యోగాతో ఎదుర్కోవచ్చంటున్నారు యోగా గురు బాబా రాందేవ్. కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదని.. అయితే ఈ వైరస్ వ్యాప్తిని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటూ..తమను తాము కాపాడుకోవాలని.. అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు.. నిలబడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని. .ఇతరులకు దూరంగా ఉండటం మంచిదన్నారు. ఇక బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు శానిటైజర్‌ని తప్పకుండా వాడాలని […]
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను యోగాతో ఎదుర్కోవచ్చంటున్నారు యోగా గురు బాబా రాందేవ్. కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదని.. అయితే ఈ వైరస్ వ్యాప్తిని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటూ..తమను తాము కాపాడుకోవాలని.. అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు.. నిలబడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని. .ఇతరులకు దూరంగా ఉండటం మంచిదన్నారు. ఇక బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు శానిటైజర్‌ని తప్పకుండా వాడాలని సూచించారు. వీలైనంత వరకు తప్పనిసరిగా మాస్కులు ధరించడం మంచిదన్నారు. అంతేకాదు.. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని.. అందుకు నిత్యం యోగా సాధన చేయాలన్నారు.ఉబ్బసం, గుండె జబ్బులు, మధుమేహంతో ఇబ్బంది పడుతూ.. చికిత్సలు తీసుకునే వారు.. జాగ్రత్తగా ఉండాలన్నారు. వీరు సహజమైన జీవనశైలిని అనుసరించడం బెటర్ అన్నారు. వీరిపై కరోనా త్వరగా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.