రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?

Congress MP Revanth Reddy: ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అక్రమాలు, భూకబ్జాల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో ఉన్నా.. కాంగ్రెస్‌లో ఉన్నా.. దందాలు, సెటిల్‌మెంట్స్, మనీ ల్యాండరింగ్, దోపిడీలు ఇలా ఒకటేమిటి ఎదుగుదలకు కారణమైన దేనిని కూడా రేవంత్ వదిలిపెట్టలేదు. ఇక ఇలాంటి వైఖరి వల్లే ప్రస్తుతం ఆయన జైలుపాలయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల కేటీఆర్ ఫామ్ హౌస్‌పై డ్రోన్లను చట్టవిరుద్ధంగా వినియోగించారు రేవంత్ రెడ్డి. ఈయన వ్యవహారం ఏకంగా […]

రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?
Follow us

|

Updated on: Mar 15, 2020 | 3:31 PM

Congress MP Revanth Reddy: ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అక్రమాలు, భూకబ్జాల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో ఉన్నా.. కాంగ్రెస్‌లో ఉన్నా.. దందాలు, సెటిల్‌మెంట్స్, మనీ ల్యాండరింగ్, దోపిడీలు ఇలా ఒకటేమిటి ఎదుగుదలకు కారణమైన దేనిని కూడా రేవంత్ వదిలిపెట్టలేదు. ఇక ఇలాంటి వైఖరి వల్లే ప్రస్తుతం ఆయన జైలుపాలయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల కేటీఆర్ ఫామ్ హౌస్‌పై డ్రోన్లను చట్టవిరుద్ధంగా వినియోగించారు రేవంత్ రెడ్డి. ఈయన వ్యవహారం ఏకంగా లోక్‌సభలో కూడా పెద్ద చర్చకు దారి తీసింది. అటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా అధిష్టానం రేవంత్ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గతంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులకే దర్జాగా బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా ఎదిగారు. ఇక గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. దీనితో రేవంత్ సెటిల్‌మెంట్స్, అక్రమాలకు, భూకబ్జాలకు అడ్దూ అదుపు లేకుండా పోయింది. ఇక తాజాగా ఆయన అక్రమార్జనల చిట్టా అంతా వెలుగులోకి రావడంతో కాంగ్రెస్‌కు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అప్పగిస్తామని ఓ టీఆర్ఎస్ లీడర్ పేర్కొన్నారు.

రేవంత్ కుటుంబం అవినీతి ఏపీలో కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కూతురు నిమిషారెడ్డి వ్యాపారాలన్నీ అక్రమమేనని ఆయన ఆరోపించారు. 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలో ఏపీలోని భీమవరంలో కామెరూన్ ఫుడ్స్ పేరుతో రేవంత్ కుమార్తె వ్యాపారాలు ప్రారంభించిందని.. అది అక్రమమా.. సక్రమమా అని తేల్చాలని జగన్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కాగా, రేవంత్ వ్యవహారాలన్నింటిని ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని.. ఆయన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటికి తీస్తామని హెచ్చరించారు.

For More News:

ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!

సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే.!

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమేనా ఫస్ట్ లవ్ః ప్రదీప్

భారత్‌లో సెంచరీ దాటిన కరోనా కేసులు.. అత్యధికం మహారాష్ట్ర..

కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!