ఈనెల 25న సీఎం జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా పర్యటన, 16 వేల మంది పేద ప్రజలకి ఇళ్ళ పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 25 న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. కాకినాడ బీచ్ రోడ్ దగ్గర పేదలకు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 25 న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. కాకినాడ బీచ్ రోడ్ దగ్గర పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ పట్టణంలోని దాదాపు 16 వేల మంది పేద ప్రజలకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ళ పట్టాలు అందజేయబోతున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎంపి వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జిల్లా అధికారులు సమీక్షిస్తున్నారు. సీఎం తూర్పుగోదావరి జిల్లా టూర్ కి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ చేశారు.