AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిల్‌గేట్స్‌కు షాక్.. ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ సీఈవో..

అమెజాన్ సీఈవో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఇటీవల బ్లూంబర్గ్ ఇండిక్స్ విడుదల చేసిన జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. బెజోస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న మైక్రోసాప్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్‌కు ఈ సారి మాత్రం షాక్ తగిలింది. బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ రెండో స్థానంలో నిలిచారు. ఆర్నాల్డ్ మొత్తం ఆస్తుల విలువ 108 బిలియన్ డాలర్లు కాగా.. గేట్స్ ఆస్తుల విలువ మొత్తం 107 […]

బిల్‌గేట్స్‌కు షాక్.. ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ సీఈవో..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2019 | 7:09 AM

Share

అమెజాన్ సీఈవో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఇటీవల బ్లూంబర్గ్ ఇండిక్స్ విడుదల చేసిన జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. బెజోస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న మైక్రోసాప్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్‌కు ఈ సారి మాత్రం షాక్ తగిలింది. బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ రెండో స్థానంలో నిలిచారు. ఆర్నాల్డ్ మొత్తం ఆస్తుల విలువ 108 బిలియన్ డాలర్లు కాగా.. గేట్స్ ఆస్తుల విలువ మొత్తం 107 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెజాన్ చీప్ బెజోస్ తన భార్య మెకంజీ బెజోస్‌కు భారీగా భరణం సమర్పించుకున్నప్పటికీ.. 125 బిలియన్ డాలర్లతో తొలిస్థానంలో నిలిచారు.

జెఫ్ బెజోస్‌ నుంచి విడాకులు తీసుకున్న మకెంజి బెజోస్ మూడో సంపన్న మహిళగా నిలిచారు. 40.3 బిలియన్ డాలర్ల సంపదతో ఆమె జాబితాలో 22వ స్థానంలో ఉన్నారు. లారె‌ల్‌ వారసురాలు బెట్టెన్ మెయెర్స్ ప్రపంచంలోని సంపన్న మహిళగా నిలిచారు. ఓవరాల్ సంపన్నుల జాబితాలో ఆమె పదోస్థానంలో ఉన్నారు. వాల్‌మార్ట్‌కు చెందిన అలైస్ వాల్టన్ రెండో సంపన్న మహిళగా నిలిచారు. ఇక అత్యంత ధనికుడైన భారతీయడు ముకేశ్ అంబానీ 51.8 బిలియన్ డాలర్లతో సంపన్నుల జాబితాలో 13వ స్థానంలో నిలిచారు. విప్రో సీఈవో అజిమ్ ప్రేమ్‌జి 20.5 బిలియన్ డాలర్లతో 48వ స్థానంలో ఉన్నారు. ఇక శివ నాడార్ 92వ స్థానంలో, ఉదయ్ కొటక్‌ 96వ స్థానంలో ఉన్నారు.

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!