ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ తప్పనిసరి: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల పోలీసులకు సుప్రీం షాక్ ఇచ్చింది. పోలీసులు చేసే ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు తర్వాతే కోర్టు దృష్టికి తీసుకురావాలని  సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాలకు సూచించింది. కాగా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్‌ 302 నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపీ పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంలో […]

ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ తప్పనిసరి: సుప్రీం కోర్టు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2019 | 9:20 AM

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల పోలీసులకు సుప్రీం షాక్ ఇచ్చింది. పోలీసులు చేసే ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు తర్వాతే కోర్టు దృష్టికి తీసుకురావాలని  సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాలకు సూచించింది.

కాగా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్‌ 302 నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపీ పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంలో సవాల్‌ చేశాయి. తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టని సుప్రీం కోర్టు ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ తప్పనిసరి అంటూ తీర్పు వెలువరించింది.