యూపీ సీఎంకు ప్రియాంక రిక్వెస్ట్!
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన వ్యక్తిగత భద్రతపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. తాను యూపీ పర్యటనకు వచ్చినపుడు కనీస భద్రత కల్పిస్తే చాలన్నారు. తాను రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు భద్రత కల్పిస్తున్నందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, కానీ తనకు కల్పించే భద్రత వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించిన తర్వాత ప్రియాంక తన తల్లి సోనియా గాంధీతో కలసి నియోజకవర్గ […]

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన వ్యక్తిగత భద్రతపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. తాను యూపీ పర్యటనకు వచ్చినపుడు కనీస భద్రత కల్పిస్తే చాలన్నారు. తాను రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు భద్రత కల్పిస్తున్నందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, కానీ తనకు కల్పించే భద్రత వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించిన తర్వాత ప్రియాంక తన తల్లి సోనియా గాంధీతో కలసి నియోజకవర్గ పర్యటనకు వచ్చినపుడు తమ కాన్వాయ్‌లో 22 వాహనాలు ఏర్పాటు చేశారని దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని లేఖలో ప్రస్తావించారు.



