మరో బోల్డ్ క్యారక్టర్‌లో అమల.. ఈసారి..

బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎరోటిక్ ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌కు విపరీతమైన ప్రేక్షాధారణ లభించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ లీడ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్‌కు యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఈ సిరీస్‌ను తెలుగులో తీయాలని నిర్మాత రోని స్క్రూవాలా ప్రయత్నిస్తున్నారట. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్‌లు ఈ సిరీస్‌లోని నాలుగు కథలను డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఒక హీరోయిన్ […]

  • Updated On - 11:45 am, Wed, 9 October 19 Edited By:
మరో బోల్డ్ క్యారక్టర్‌లో అమల.. ఈసారి..


బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎరోటిక్ ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌కు విపరీతమైన ప్రేక్షాధారణ లభించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ లీడ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్‌కు యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఈ సిరీస్‌ను తెలుగులో తీయాలని నిర్మాత రోని స్క్రూవాలా ప్రయత్నిస్తున్నారట. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్‌లు ఈ సిరీస్‌లోని నాలుగు కథలను డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ సిరీస్‌లో ఒక హీరోయిన్ గా మలయాళ భామ అమలాపాల్ ని ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్టైలిష్ విలన్ జగపతిబాబు కూడా ఒక రోల్‌లో నటించనున్నాడని సమాచారం. కథ ప్రకారం జగపతి బాబు రిచ్ బాస్ పాత్రలో కనిపిస్తాడట. అతడి దగ్గర పని చేసే ఎంప్లాయ్‌గా అమలా కనిపిస్తుందట. వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగడం, కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. హిందీలో కియారా అద్వానీ ఎలా నటించిందో చెప్పనక్కర్లేదు. మరి అమలాపాల్ అలాంటి నటనను కనబరుస్తుందా లేదా అనేది చూడాలి.