బండి సంజయ్‌ నన్ను మోసం చేశారు…! ఎమ్మెల్యే రాజాసింగ్ ఆడియో వైరల్..

బండి సంజయ్‌ నన్ను మోసం చేశారు. ఈ మాటలన్నది ఎవరో కాదు.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. దూకుడు మీదున్న టి-బీజేపీకి ఇది గ్రేటర్‌ షాక్ తగిలే అవకాశం ఉంది. రాజాసింగ్‌ ఆడియో కమలంలో తీవ్ర కలకలానికి దారితీసింది.

బండి సంజయ్‌ నన్ను మోసం చేశారు...! ఎమ్మెల్యే రాజాసింగ్ ఆడియో వైరల్..
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 22, 2020 | 9:39 PM

BJP MLA Raja Singh Against Bandi :  బండి సంజయ్‌ నన్ను మోసం చేశారు. ఈ మాటలన్నది ఎవరో కాదు.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. దూకుడు మీదున్న టి-బీజేపీకి ఇది గ్రేటర్‌ షాక్ తగిలే అవకాశం ఉంది. రాజాసింగ్‌ ఆడియో కమలంలో తీవ్ర కలకలానికి దారితీసింది.

నేను ఎక్కడా ఇన్వాల్వ్‌ కాను.. నా నియోజకవర్గంలో నన్ను గెలిపించిన కార్యకర్తలకు న్యాయం చేస్తే చాలని కోరినా.. టికెట్ల కేటాయింపులో అన్యాయం చేశారని రాజాసింగ్ ఆవేదన. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పైనే ఫిర్యాదు చేస్తాననడం హాట్‌ హాట్‌గా మారింది.

నా నియోజకవర్గంలో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయా. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర నాయకత్వానికి లేఖ రాస్తా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మిగిలిన డివిజన్లలో నేను జోక్యం చేసుకోను. నా నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వమన్నా పట్టించుకోలేదు. నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని అడిగాను. ఇక్కడ నాయకులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నన్ను గెలిపించిన కార్యకర్తలకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయాను అని రాజాసింగ్‌ వాయిస్‌తో ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.