హైదరాబాద్‌ను అహ్మదాబాద్, సూరత్, ఇండోర్ లాంటి నగరాలుగా చేస్తాం, బల్దియాలో ఎగిరేది కాషాయ జెండానే: బీజేపీ బండి సంజయ్

హైదరాబాద్ నగరంలో బీజేపీ మేయర్ అయితే హైదరాబాద్‌ను అహ్మదాబాద్, సూరత్, ఇండోర్ లాంటి నగరాలుగా చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్. బీజేపీకి హైదరాబాద్ ప్రజలు ఓటేసి ఎంఐఎం, టీఆర్ఎస్‌లకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్‌ఎస్‌ పోవాలని బండి సంజయ్‌ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌కి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. రాబోయే రోజుల్లో భాగ్యనగరాన్ని పాకిస్తాన్‌గా మార్చాలని దూరాలోచన టీఆర్ఎస్‌లో ఉందని ఆరోపించారు. తమ పార్టీపై అధికార పార్టీ […]

హైదరాబాద్‌ను అహ్మదాబాద్, సూరత్, ఇండోర్ లాంటి నగరాలుగా చేస్తాం, బల్దియాలో ఎగిరేది కాషాయ జెండానే:  బీజేపీ బండి సంజయ్
Follow us
Venkata Narayana

|

Updated on: Nov 22, 2020 | 9:19 PM

హైదరాబాద్ నగరంలో బీజేపీ మేయర్ అయితే హైదరాబాద్‌ను అహ్మదాబాద్, సూరత్, ఇండోర్ లాంటి నగరాలుగా చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్. బీజేపీకి హైదరాబాద్ ప్రజలు ఓటేసి ఎంఐఎం, టీఆర్ఎస్‌లకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్‌ఎస్‌ పోవాలని బండి సంజయ్‌ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌కి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. రాబోయే రోజుల్లో భాగ్యనగరాన్ని పాకిస్తాన్‌గా మార్చాలని దూరాలోచన టీఆర్ఎస్‌లో ఉందని ఆరోపించారు. తమ పార్టీపై అధికార పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. రాజాసింగ్ పేరుతో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎన్ని చేసినా హైదరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.