డిజిటల్ సీక్రెట్స్: 2020లో ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌వర్డ్స్ గా తేలినవి ఇవేనట. !.. జర జాగ్రత్తమరి
డిజిటల్ లావాదేవీల్లో పాస్ వర్డ్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం. మొబైల్స్, బ్యాంక్ అకౌంట్స్, మెయిల్స్, పలురకాల యాప్స్.. ఇలా అన్నింటికి మనం ఎంచుకునే తాళం చెవి ఈ పాస్ వర్డ్. అయితే, ఈ ఏడాదికి గాను ప్రపంచంలో అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు ఇవేనని కొన్ని రకాల పాస్‌వర్డ్‌లను విడుదల చేసింది ఒక టెక్ సంస్థ . 2020లో అత్యంత చెత్త పాస్ వర్డ్ 123456 అని వెల్లడించింది. దీన్ని […]
డిజిటల్ లావాదేవీల్లో పాస్ వర్డ్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం. మొబైల్స్, బ్యాంక్ అకౌంట్స్, మెయిల్స్, పలురకాల యాప్స్.. ఇలా అన్నింటికి మనం ఎంచుకునే తాళం చెవి ఈ పాస్ వర్డ్. అయితే, ఈ ఏడాదికి గాను ప్రపంచంలో అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు ఇవేనని కొన్ని రకాల పాస్‌వర్డ్‌లను విడుదల చేసింది ఒక టెక్ సంస్థ . 2020లో అత్యంత చెత్త పాస్ వర్డ్ 123456 అని వెల్లడించింది. దీన్ని హ్యాకర్లు, సైబర్ నేరాలకు పాల్పడేవారు 2.3 కోట్ల సార్లు ఛేదించారట కూడా. దీని తర్వాత స్థానంలో 1234567889 ఉంది. మూడో స్థానంలో picture1 అనే పాస్ వర్డ్ నిలిచింది. వీటితో పాటు password,123456, qwerty, ‘111111’, ‘12345678’, ‘123123’, ‘12345’ ‘1234567890’, ‘1234567’, ‘qwerty, ‘abc123’, ‘Million2’, ‘000000’, ‘1234’, ‘iloveyou’, ‘aaron431’, ‘password1’, ‘qqww1122’లను అత్యంత చెత్త పాస్ట్‌వర్డ్‌లుగా సదరు సంస్థ ప్రకటించింది. అదీ సంగతి.. ఈ పాస్ వర్డ్ లు మీరుకనుక పెట్టుకుంటే, మార్చుకోండి మరి. అంతేకాదు, ప్రతి 90 రోజులకు ఒకసారి పాస్ట్‌వర్డ్‌లను మార్చు కోవాలని కూడా సదరు సంస్థ సూచించింది.