భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక “కర్వా చౌత్”

దీపావళి ముందు వచ్చే చవితి రోజున అంటే కార్తీక పౌర్ణమి తరువాత నాలుగవ రోజున జరుపుకునే పండుగ కర్వా చౌత్. దీన్ని ఉత్తరాదికి చెందిన మహిళలు ప్రత్యేకంగా జరపడం ఆనవాయితీగా వస్తుంది. తమ భర్తల క్షేమం కోసం ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పతియే ప్రత్యక్ష దైవం అని భావించే మన సంప్రాదాయంలో ఈ పండుగను ప్రత్యేకత ఉంది. ఈ పండుగను ఉత్తరాదికి చెందినవారు జరుపుకుంటున్నా.. ఇటీవల కాలంలో దక్షిణాదికి కూడా అది విస్తరించింది. తమ […]

భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక కర్వా చౌత్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 17, 2019 | 8:55 PM

దీపావళి ముందు వచ్చే చవితి రోజున అంటే కార్తీక పౌర్ణమి తరువాత నాలుగవ రోజున జరుపుకునే పండుగ కర్వా చౌత్. దీన్ని ఉత్తరాదికి చెందిన మహిళలు ప్రత్యేకంగా జరపడం ఆనవాయితీగా వస్తుంది. తమ భర్తల క్షేమం కోసం ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పతియే ప్రత్యక్ష దైవం అని భావించే మన సంప్రాదాయంలో ఈ పండుగను ప్రత్యేకత ఉంది. ఈ పండుగను ఉత్తరాదికి చెందినవారు జరుపుకుంటున్నా.. ఇటీవల కాలంలో దక్షిణాదికి కూడా అది విస్తరించింది. తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ రోజున సంపూర్ణ ఉపవాసం పాటిస్తారు. ఉదయం నుంచి ఉపవాసముండి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి, నింగిలో చందమామ రాగానే ఒక జల్లెడ చాటున భర్తను చూడటం ఈ పండుగలో విశేషం. ఈ విధంగా చేయడం వల్ల తమ భర్త క్షేమంగా ఉంటాడని భర్య విశ్వాసం. జల్లెడ చాటున భర్తను చూసి ఆ తర్వాత తన ఉపవాస దీక్షను విరమిస్తుంది భార్య.

ఇటీవల ఓ సంస్ధ నిర్వహించిన సర్వేలో కర్వా చౌత్ కోసం ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నిజానికి ఈ పండుగను భర్తల క్షేమం కోసం జరుపుతున్నా.. ముఖ్యంగా తమ ప్రేమను వ్యక్తపరచడానికి దీన్ని ఆచరిస్తున్నట్టుగా 60 శాతం మంది మహిళలు వెల్లడించారు. ఇక ఇది ఆచారంగా వస్తున్నందున చేస్తున్నామని 35 శాతం మంది చెప్పారు. ఇక మిగిలిన 15 శాతం మంది మాత్రం.. సమాజం ఒత్తిడితోనే దీన్ని ఆచరిస్తున్నామని తమ మనసులో మాటను బయటపెట్టారు.

కర్వా చౌత్ పండుగ ప్రత్యేకించి ఆడవారికి చెందినదనప్పటికీ.. అందులో భార్య,భర్తల అనుబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పదికాలలపాటు వీరు ప్రేమానురాగాలతో కలిసి జీవించాలనే ఆశ ఈ పండుగలో కనిపిస్తుంది. ఈ పండుగ ఉత్తరాది రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్న ఉత్తరాదికి చెందిన కుటుంబాలు దీన్ని సెలబ్రేట్ చేస్తారు. అయితే కర్వా చౌత్ లాంటి పండుగ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఒకటుంది. అదే అట్ల తద్దె. దీన్ని పెళ్లికాని ఆడపిల్లలు జరుపుకోవడం తెలిసిన విషయమే.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..