Aishwarya With Pawan: పవన్‌తో జోడికట్టనున్న ఐశ్వర్య.. ఛాలెంజ్ రోల్‌లో నటించనున్న బ్యూటీ.?
Pawan-Krish Movie Update: ఓవైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే మరోవైపు సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిన్న విరామం తర్వాత..

Pawan-Krish Movie Update: ఓవైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే మరోవైపు సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిన్న విరామం తర్వాత వకీల్ సాబ్‌తో సినిమాలు మొదలు పెట్టిన పవన్ వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతూ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతున్నాడు. ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. పిరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ బందిపోటు తరహా పాత్రలో కనిపించనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ఐశ్వర్య రాజేశ్ నటించనుందని సదరు వార్త సారాంశం. అంతేకాదు ఐశ్వర్య ఇందులో ఒక గిరిజన యువతి పాత్రలో ఛాలెంజ్ రోల్‌ను పోషించనుందని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే. ఇదిలా ఉంటే ‘అయ్యప్పన్ కొశియమ్’ రీమేక్‌లోనూ ఐశ్వర్య నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం విదితమే. ఇక దర్శకుడు క్రిష్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిందని వార్తలు వచ్చాయి.. అయితే క్రిష్ వార్తలను ఖండించకపోవడంతో, ఇది నిజమేనని తేలింది. దీంతో పవన్ చిత్రం మరింత వాయిదా పడే అవకాశాలున్నాయి.
Also Read: sam jam show : సమంత షోలో నాగచైతన్య.. భర్త తో కలిసి సందడి చేయనున్న అక్కినేని కోడలు పిల్ల