Mega Multi starrer : చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేది అప్పుడేనా..? నిర్మాత సుబ్బరామి రెడ్డి ప్లాన్ ఏంటి.?
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలనీ మెగా అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామి రెడ్డి. ఆమధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో

Mega Multi starrer : మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలనీ మెగా అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామి రెడ్డి. ఆమధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మెగా అభిమానులంతా ఆ శుభతరుణం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తారని కూడా సుబ్బరామి రెడ్డి. ప్రకటించారు.ఈ మూవీ అనౌన్స్ చేసి నాలుగేళ్లు అవుతుంది. సినిమా ఎప్పుడు మొదలు పెడతారన్నదని పైన ఇంతవరకు క్లారిటీ లేదు. అసలు ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఇదే సమయంలో వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి రాబోయే దసరా నాటికి ఈ మూవీని లాంఛ్ చేయాలని టి.సుబ్బరామి రెడ్డి పట్టుదలగా ఉన్నారట. విజయదశమికి కొబ్బరికాయ కొట్టి 2022 నాటికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. మరో కైపు చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ముగ్గురు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ ఏకంగా నాలుగు సినిమాలు ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘వకీల్ సాబ్’ తర్వాత ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ లో నటించనున్నాడు పవన్. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒకటి హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మరొక ప్రాజెక్టు క్యూలో ఉన్నాయి. అటు మెగాస్టార్ ప్రస్తుతం ‘ఆచార్య’ చేస్తున్నారు.. ఆ వెంటనే ‘లూసీఫర్’ రీమేక్ చేసేందుకు అంతా సిద్ధమైంది. అది కూడా పూర్తయితే.. ‘వేదాళం’ లైన్లో ఉంది. ఇక త్రి విక్రమ్ కూడా జూనియర్ ఎన్ఠీఆర్ తో సినిమా చేయనున్నాడు. మరి మెగాస్టార్, పవర్ స్టార్ మల్టీస్టారర్ పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
also read : Aishwarya With Pawan: పవన్‌తో జోడికట్టనున్న ఐశ్వర్య.. ఛాలెంజ్ రోల్‌లో నటించనున్న బ్యూటీ.?