Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

sam jam show : సమంత షోలో నాగచైతన్య.. భర్త తో కలిసి సందడి చేయనున్న అక్కినేని కోడలు పిల్ల

అక్కినేని సమంత హోస్ట్ గాప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర్జున్ ఇలా చాలా మంది హాజరయ్యారు.

sam jam show : సమంత  షోలో నాగచైతన్య.. భర్త తో కలిసి సందడి చేయనున్న అక్కినేని కోడలు పిల్ల
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 03, 2021 | 10:05 PM

sam jam show : అక్కినేని సమంత హోస్ట్ గాప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర్జున్ ఇలా చాలా మంది హాజరయ్యారు. వ్యూస్ పరంగా కూడా ఈ షోకు మంచి పేరు వచ్చింది.  తాజాగా ఈ షోకు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య గెస్ట్ గా రానున్నాడు. ఈ సీజన్ కు ఈ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. కచ్చితంగా భర్తతో సమంత సందడి చేస్తుందని.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ చూడ్డానికి రెడీగా ఉండాలంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలైంది.చైతూ సీక్రేట్స్ బయట పెట్టాలని సమంత ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. ఎందుకంటే ఈ షో కాన్సెప్టే అది. అక్కడికి వచ్చిన గెస్టుల దగ్గర్నుంచి వీలైనంత వరకు తెలియని విషయాలను బయట పెట్టిస్తుంది సమంత. ఈ ఎపిసోడ్‌తో తొలి సీజన్‌కు గ్రాండ్ ముగింపు ఇవ్వాలని చూస్తుంది షో దర్శకురాలు గా వ్యవహరిస్తున్న నందిని రెడ్డి. మరోవైపు అక్కినేని అభిమానులే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా స్యామ్ జామ్ నాగ చైతన్య ఎపిసోడ్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. చూడాలి మరి సమంత చైతన్య దగ్గరనుంచి ఎలాంటి సీక్రెట్స్ బయటపెట్టిస్తుందో..

also read : Wild Dog Movie : ఓటీటీ వేదికగా నాగార్జున సినిమా.. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న వైల్డ్ డాగ్ .?