Wild Dog Movie : ఓటీటీ వేదికగా నాగార్జున సినిమా.. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న వైల్డ్ డాగ్ .?
కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తుంది..

Wild Dog Movie : కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మగా ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రను చేస్తున్నారు. క్రిమినల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వల్ల సినిమాలో ఆయనను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారట. నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ రీఓపెన్ అయ్యాయి. ఒకటి రెండు సినిమాలు కూడా విడుదల అయ్యాయి. ఇక సంక్రాంతికి గట్టి పోటీనే ఉంది. ఇలాంటి సమయంలో వైల్డ్ డాగ్ సినిమాను ఓటీటీ విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వైల్డ్ డాగ్ సినిమా హక్కులను భారీ మొత్తంలో కొనుగోలు చేసిందని సమాచారం. ఇక జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. దీనిపైనా త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.