AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: కొత్త ఏడాది కథ వేరే ఉంటది.. అభిమానులకు సిగ్నల్స్ పంపిన పవర్ స్టార్..!

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ న్యూ ఇయర్‌ సందర్భంగా కొత్త రిజెల్యూషన్‌ తీసుకున్నట్టున్నారు. ఇన్నాళ్లు షూటింగ్‌ల విషయంలో స్లో అండ్‌ స్టడీ సూత్రాన్నీ ఫాలో అయిన పవన్.. కొత్త ఏడాదిలో స్పీడు పెంచుతున్నారు.

Pawan Kalyan: కొత్త ఏడాది కథ వేరే ఉంటది.. అభిమానులకు సిగ్నల్స్ పంపిన పవర్ స్టార్..!
Ram Naramaneni
|

Updated on: Jan 03, 2021 | 9:59 PM

Share

Pawan Kalyan: పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ న్యూ ఇయర్‌ సందర్భంగా కొత్త రిజెల్యూషన్‌ తీసుకున్నట్టున్నారు. ఇన్నాళ్లు షూటింగ్‌ల విషయంలో స్లో అండ్‌ స్టడీ సూత్రాన్నీ ఫాలో అయిన పవన్.. కొత్త ఏడాదిలో స్పీడు పెంచుతున్నారు. ఒక్కటి కాదు ఒకేసారి రెండు సినిమాలు అంటూ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నారు. లాక్‌ డౌన్‌ తరువాత అందరికంటే ఆలస్యంగా సెట్‌కు వచ్చిన హీరో పవన్‌ కల్యాణే. వకీల్‌ సాబ్‌ షెడ్యూల్‌ను లేట్‌గా స్టార్ట్ చేసిన పవన్‌… షూటింగ్‌ను కూడా నెమ్మదిగా చేస్తూ వచ్చారు. పది రోజులు షూటింగ్ చేస్తే నెల రోజుల బ్రేక్ తీసుకుంటూ ఎట్టకేలకు వకీల్ సాబ్‌ను కంప్లీట్ చేశారు.

అయితే కొత్త ఏడాదిలో మాత్రం సీన్‌ అలా ఉండదని ఇప్పటి నుంచే హింట్ ఇస్తున్నారు పవన్‌. ఈ మధ్యే మలయాళ సూపర్‌ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌ను స్టార్ట్‌ చేశారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఈనెల్లోనే స్టార్ట్‌ చేస్తున్నారు. పవన్‌ పోలీస్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు మరో సినిమాలో కూడా ప్యారలల్‌గా నటించేందుకు రెడీ అవుతున్నారు పవన్‌.

మల్టీ స్టారర్‌తో పాటు క్రిష్‌ డైరెక్ట్‌ చేస్తున్న సినిమాను కూడా జనవరి ఫస్ట్‌ వీక్‌లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలన్నది పవన్‌ ప్లాన్‌. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు మిగతా భాగాన్ని స్పీడ్‌గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేస్తుండటం.. వకీల్ సాబ్‌ రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఈ ఏడాది పవన్‌, 3 సినిమాలు రిలీజ్‌ చేస్తారని హ్యాపీగా ఫీలవుతున్నారు పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌. అన్నట్లు… న్యూ ఇయర్‌ సందర్భంగా హరీష్‌ శంకర్‌,‌ బండ్ల గణేష్‌ కూడా పవన్‌ని కలిశారు. సో వాటి ప్రీ ప్రొడక్షన్‌ కూడా ఈ ఇయరే స్టార్ట్ అవుతుందన్నది బోనస్‌ న్యూస్.

Also Read :

LIC Jeevan Shanti: ఎల్‌ఐసీలో అదిరే పాలసీ.. ఒక్కసారి డబ్బులు కడితే ప్రతి నెలా వేలల్లో పింఛన్ !

LPG Gas Cylinders: గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌కి ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు..తేల్చి చెప్పిన హెచ్‌పీసీఎల్

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!