DSP-Prabhas combo : ఆ కాంబినేషన్ మిస్ అవుతుందేంటి… డార్లింగ్,దేవీ అభిమానుల ఆవేదన
మన.. రాములో రాములా పాట యూరప్ దాకా మారుమోగిపోతోంది. తమన్ క్రియేట్ చేసిన బుట్టబొమ్మ ఆల్బమ్ ఆల్ టైం రికార్డుల్ని బద్దలు కొడుతోంది. దేవిశ్రీ ఇచ్చిన పాపులర్ బీట్స్..

DSP-Prabhas combo : మన.. రాములో రాములా పాట యూరప్ దాకా మారుమోగిపోతోంది. తమన్ క్రియేట్ చేసిన బుట్టబొమ్మ ఆల్బమ్ ఆల్ టైం రికార్డుల్ని బద్దలు కొడుతోంది. దేవిశ్రీ ఇచ్చిన పాపులర్ బీట్స్ బాలీవుడ్ జనాల గుండెల్లో కూడా బలంగా నాటుకున్నాయి. ఇంతేసి చరిత్రలున్న తెలుగు సంగీతాన్ని మన పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎందుకు?
ప్రభాస్ కెరీర్ లో దేవిశ్రీ క్రేజీ పాటలకంటూ ఒక స్పెషల్ ప్లేస్ వుంది. కానీ.. తనను ‘మిర్చి’ లాంటి కుర్రాడిగా మార్చిన డీఎస్పీని ‘డార్లింగ్’మర్చిపోయారా? తన నాలుగు పాన్ ఇండియా మూవీస్ లో దేవినే కాదు.. మిగతా ఫ్రెండ్స్ ని కూడా పక్కన పెట్టేశారు ప్రభాస్. ఆ మాటకొస్తే ‘సాహో’ నుంచి ప్రభాస్ సినిమాల మ్యూజిక్ లో తెలుగు ఫ్లేవర్ పూర్తిగా మిస్ అవుతోంది. రీసెంట్ గా రిలీజైన ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ కూడా జస్టిన్ ప్రభాకరన్ క్రియేట్ చేసిందే. తెలుగులో ఒక్క ‘డియర్ కామ్రేడ్’ మూవీ మాత్రమే చేసిన ఆ తమిళ్ కుర్రాడు.. ప్రభాస్ మూవీ ఛాన్స్ దక్కించుకున్నారు.
కనీసం వైజయంతీ వారి నాగ్ అశ్విన్ మూవీక్కూడా లోకల్ ఫ్లేవర్ కుదరలేదు. అశ్వనీదత్ తో సెంటిమెంటల్ టచ్ వున్న ఇళయరాజాకు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. మరోవైపు మిక్కీ పేరు కూడా వినిపిస్తోంది. అటు ‘సలార్’ మూవీకి.. ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ నే పిక్ చేసుకున్నారు కెప్టెన్ ప్రశాంత్ నీల్. ఓం రౌత్ చేస్తున్న భారీ ఎపిక్ మూవీ ‘ఆదిపురుష్’ కి మాత్రం కీరవాణి పేరు పరిశీలనలో ఉందట.
ప్రభాస్ తో ఒక్క సినిమా అయినా చేద్దామన్న తమన్ కోరిక మాత్రం తీరే మార్గం కనిపించడం లేదు. బుట్టబొమ్మ పాటతో ఓవర్సీస్ లో కూడా మిస్టర్ క్రేజీ అనిపించుకున్న తమన్.. ఇప్పుడు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు కూడా ఒప్పుకుని సౌత్ లో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు. బట్.. తమన్ కిట్టీలో డార్లింగ్ మూవీ లేదన్నదే పెద్ద వెలితి. అటు.. నార్త్ లో సైతం తన క్రేజీ బీట్స్ తో రీసౌండ్ ఇస్తున్న దేవిశ్రీ మేజిక్ కూడా ప్రభాస్ మూవీస్ కి కాకుండా పోయింది. మనవాళ్ళు పాన్ ఇండియా రేంజ్ మ్యూజిక్ ఇవ్వలేరా అనే డౌట్లు కూడా పుట్టిస్తోంది డార్లింగ్ లైనప్.
also read : sam jam show : సమంత షోలో నాగచైతన్య.. భర్త తో కలిసి సందడి చేయనున్న అక్కినేని కోడలు పిల్ల