రోజాపై బండ్లగణేష్ ఆసక్తికర కామెంట్

సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకునేందుకు తాపత్రయపడే టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి రోజా రావడంతో, అదే ఫంక్షన్ కు వచ్చిన బండ్ల గణేశ్ ఆమెతో ముచ్చటించిన అనంతరం ఒక ఫొటో దిగి దానిని సోషల్ మీడియాలో వదిలారు. చాలాకాలం తర్వాత రోజాను కలిశానని.. ఆమె కెరీర్ […]

రోజాపై బండ్లగణేష్ ఆసక్తికర కామెంట్

సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకునేందుకు తాపత్రయపడే టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి రోజా రావడంతో, అదే ఫంక్షన్ కు వచ్చిన బండ్ల గణేశ్ ఆమెతో ముచ్చటించిన అనంతరం ఒక ఫొటో దిగి దానిని సోషల్ మీడియాలో వదిలారు. చాలాకాలం తర్వాత రోజాను కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని, ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్టు వివరించారు. కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రోజా వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం నడిచిన సంగతి తెలిసిందే.