Narender Vaitla |
Updated on: Jan 14, 2022 | 11:00 AM
2015లో వచ్చిన ప్రేమమ్ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార అనుపమ పరమేశ్వరన్. తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుందీ బ్యూటీ.
ఇక నితిన్ హీరోగా తెరకెక్కి అఆ చిత్రంలో నాగవల్లి పాత్రలో తెలుగు ప్రేక్షకులను సైతం కట్టిపడేసిన ఈ చిన్నది అనంతరం వరుస అవకాశాలను సొంతం చేసుకుంది.
కెరీర్ తొలి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోన్న అనుపమ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ చిన్నది నటించిన తాజా చిత్రం రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకగా నేడు (శుక్ర వారం) విడుదలైంది. ఇక ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్‌తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది అనుపమ.
రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనుపమ ఇలా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తు చర్చ జరగడంతో ఏకంగా అనుపమ స్పందించాల్సి వచ్చింది.