Makara Sankranti 2022: భిన్నత్వంలో ఏకత్వం పతంగుల పండుగ.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసా!

Hyderabad Kites Festival: మొగులు రందులద్దుకునుడు మీరెప్పుడైన సూశిండ్రా..? గడియకోపారి రంగుమార్సే మబ్బుల్నెప్పుడైన నజరేశిండ్రా..? పోనీ రెక్కలు లేని పిట్టలను..? డబ్బాకారంలున్న తోక చుక్కలను..? ఈ తరమోల్లకు గా నసీబు ...

Makara Sankranti 2022: భిన్నత్వంలో ఏకత్వం పతంగుల పండుగ..  దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసా!
Kite Desrival
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 14, 2022 | 1:32 PM

Makara Sankranti 2022: మొగులు రందులద్దుకునుడు మీరెప్పుడైన సూశిండ్రా..? గడియకోపారి రంగుమార్సే మబ్బుల్నెప్పుడైన నజరేశిండ్రా..? పోనీ రెక్కలు లేని పిట్టలను..? డబ్బాకారంలున్న తోక చుక్కలను..? ఈ తరమోల్లకు గా నసీబు … ఆ మోకా లేదు గాని .. ఓ ముప్పై..నల్బై ఏండ్ల కిందనైతే సంకురాత్రి పండుగంటే నువొద్దిగనే మొగులు రంగులద్దుకునేది. ఇంచు కూడా ఇడ్సిపెట్టకుంట పైన పతంగులు ఏగిరేటియి. అసలు సంకురాత్రి అంటేనే పతంగుల పండుగ ఈడ! అంటే హైద్రబాద్ల అన్నట్టు! ఒగప్పుడు దీపావళి ఒడ్వంగనే దుక్నాల్ల పతంగుల తోర్ణాల్లెక్క ఏల్లాడేటియ్యి. మేము కూడా బడి నుంచి రాగానే పుస్తకాలు పడేశి చెర్ఖా, పతంగులు తీసుకుని బయటపడేది. ఇగ సంకురాత్రి సెల్వులోస్తే చెప్పవశమే లేదు. చిన్నపెద్ద, ముసలి ముత్క తేడా లేకుంట పశివోరలను నుంచి పెద్దమన్సుల దాక మిదెక్కుతే మీదికెల్లి దిగేటోల్లు కారు. దచ్చిణాయం నుంచి ఉత్తరాయణం సొచ్చేటప్పుడు అచ్చే ఎండ పొడ పెయ్యికి మంచిదంటరు. అందుకే పతంగులను ఏగ్రేశే ఆచారంబుట్టిదంటరు. అస్సలు పతంగులు ఏగ్రేశేతందుకు ఇంతకంటే మంచి మోకా మల్లోటి ఉండదేమో.

పతంగులంటే అల్లాటప్ప ఉండది.. కుదమట్టంగున్న రెండు కోళ్యాగల నడ్మ కోట్లాట, పందానికి సై అన్న రెండు కోడిపుంజుల కోపాల లెక్కనే ఉంటది పోరు. ఒగడు ఏగ్రేశే పతంగి మీద ప్రతాపం చూపిచ్చి పక్కోని పతంగిని గుంజిపట్టి కోసే పనిని పేంచి ఇచ్చుడు అంటరు. పేంచ్‌ ఏశ్నమంటే పతంగుల నడ్మ పోరు షుర్వైనట్టే. ఎవరు ఎన్ని పతంగులు కాట్‌ చేస్తే అంత తురములెక్క అన్నట్టు. మరీ ఎదుటోని పతంగిమీదికి పతంగితోటి యుద్దానికి పోవుడంటే ఇసిరెలు కూడ అందుకు దగ్గట్టే చూసుకోవాలే గద. అంటే యుద్దాన్కి పోతున్నప్పుడు దాన్కి తగ్గట్టే కత్తులు, డాల్లుండాలే గద. అగో అందుకోసాన్కే బందోవస్తు మాంజాను కొన్కద్దురు. గాజు పొడిని అద్దినా దారాన్ని మాంజా అనేటోల్లు. రెండు పతంగులు ముడిపడ్డ తర్వాత దారం పదునును పట్టి పత్ల ఉన్నది ఉత్తగనే తెగిపోతది. మరీ ఇసోంటి మాంజాలు ఏడా వడ్తే ఆడ దొర్కేటియే కాదు. ఈటికోసం అలగ్‌ అడ్డలుండేటియి.

పాతబస్తిలున్న పత్తర్‌గట్టి, గుల్జర్‌ హౌజ్‌, మంగళ్‌హాట్లకు పోతే ఎటుచూసిన పతంగుల దుక్నాలే కన్పిచ్చేటియ్యి. ఆడ మంచి మాంజా అగ్వన దొరికేది. ఇగ గుల్జార్‌ హౌజులున్న జ్నానేశ్వర్‌ మాంజాకు, లష్కర్ల కింగ్స్‌ వేలున్న పెంటయ్య మాంజాకు మాంచి డిమాండ్‌ ఉండేది అప్పట్ల. ఆడికెల్లి మాంజా కొన్కొచ్చినమంటే మారాజుల్లెక్క పోజులు కొట్టేటోల్లు. అరె.. ఏడికెళ్లి తెచ్చినవ్‌రా మాంజా అని దోస్తుగాళ్లు అడిగితే.. గుల్జార్‌హౌజ్‌కెళ్లి అని గొప్పగా చెప్పుకునేటోళ్లు.. ఆల్ల కథనే అలగ్‌ సలగ్‌ ఉండేది. లోకల్లనే కాదు ఈడ తయారైన పతంగులు, మాంజాలు పక్కదేశాలు కూడా పంపిద్దురు. గుల్జార్‌హౌజ్‌కు సైకిలేసుకుని పోయేటోళ్లం.. సైకిల్‌ దొరక్కపోతే నడ్సుకుంటనే ఆడిదాక పోయేటోళ్లం.. వచ్చేతప్పుడు మదీనాల చాయితాగేటోళ్లం..

మేము కూడా మాంజా సుతాయిస్తుండే! డిసెంబర్‌లనే మొదలు పెట్టేలోళ్లం.. మెత్తటి గాజుపొడి, కలబంద గుజ్జు, అన్నంముద్ద, కోడిగుడ్డు, బెండకాయ, కలర్‌ కోసం రంగులను వాడేటోళ్లం. సోడా సీసా మంజాకు మంచిగుంటుందని ఎవడో చెప్పంగ విని ఆ సీసాను ఎర్కపట్టి దంచుడు షురు చేసేటోళ్లం.. ఇంట్ల తెలిస్తే తిడతరని గాజును పొడి గొట్టడం బయటనే చేసేటోళ్లం.. గిప్పుడంటే కలబంద ఏడబడితే ఆడ దొరుకుతుందిగానీ అప్పట్లో చాలా కష్టమయ్యేది.. ముందుగాళ్ల ఎవరింట్ల కలబంద ఉన్నదో ఎర్కబట్టేటోళ్లం.. ఎనకసిరికి ఆ ఇంటికాడ రెక్కి చేసేటోళ్లం.. పొద్దుగూకంగనే కలబంద పీక్కొచ్చేటోళ్లం. అన్ని దొరికినాంక మాంజా సుతాయించేది.. సన్నిటి దారం రీలుమీద ఇయ్యన్ని కల్పిన ముద్దను పూస్తే పతంగుల పౌరుషాన్ని చూపిచ్చేతందుకు ఆయుధం తయారన్నట్టే.

ఇగ మాంజాను గీటి లెక్కన కోల్సేటోల్లు. ఒక్క గీటి అంటే ఏందక్వ 45 మీటర్ల పొడ్వు ఉండేదన్నట్టు. దుకాన్లలల్ల గీటిల లెక్కనే మాంజా అమ్మేటోళ్లు.. సగం గీటి కావాలంటే లచ్చలు కొట్టి ఇచ్చేటోళ్లు.. అంటే లచ్చల లెక్క అని కూడ ఓటి ఉన్నదన్నట్టు. లచ్చా అంటే బోట్నేలి నుంచి దారాన్ని చిట్కెనేల్కు దాక సుట్టి మల్ల బోటనేలి దాక సుట్టుకుంట అచ్చుడన్నట్టు. ఎన్మీది నెంబరు ఆకారంల దారాన్ని సుడుతరు. ఎవడైనా గొప్పకుపోతే ఆడు లచ్చాలు కొడుతుండ్రా అనేటోళ్లు.. గా ముచ్చటగిప్పుడేందుగ్గానీ అట్నే మాంజాలల్ల కూడ తీరు తీర్ల రకాలున్నయి. మోతియ , గాజర్‌, గంధక్‌, ఫెరోజా, టీలా, కశ్మీర , హారా, కాలా, అండేకా, రెడ్‌రోజ్‌ ఇట్ల వో బొచ్చెడు రకాలుండే. మస్తు రంగులల్ల దొరికేటివి. గంధం మాంజాను ఎక్వ డీలిడిశేతందుకు వాడేటోల్లు. పతంగులెగరేసుట్ల పీజీ చేసినోళ్లు మాంజాను చూసి అది డీల్‌కు పనికొస్తదో, కీంచ్‌కు పనికొస్తదో చెప్పేటోళ్లు.. ఒక్కసారి పతంగిని కాట్‌ చేశేతందుకు మస్తు టైం పడ్తుండే. అసోంటి ఆట్ని మొండి పేంచులనేటోల్లు. పేంచ్‌ పడ్డంక దారాన్ని ఇడ్సిపెట్టి , గుంజుకుంట , మల్ల ఒదలు చేస్కుంట ఉంటే దాన్ని కీంచ్‌ అంటరు. అంటే దారాన్ని గట్టిగ గుంజుడన్నట్టు. అట్ల కాకుంట దారాన్ని నిమ్మళంగ ఇడ్సిపెట్టుకుంట పోతే దాన్ని డీల్‌ అంటరు.

కొద్దిగ కర్కు కర్కున్న మాంజాతోటి కీంచ్‌ మస్తుగొస్తుంటది. కొద్దిగ నున్నగ ఉన్న మాంజాతోటైతే డీల్‌ జబర్దస్త్‌ వొస్తుండే. ఇగ అవుతలోని పతంగిని కోశ్న సంబురాన్ని ఆఫ్పైంది..సఫ్పైంది అని కొందరు కీకలు పెట్టుకుంట ఉర్కుతుండే. క్యా కాటే అని గాయి గాయి లొల్లి చేస్తుండే. ఎక్కడ్నో పతంగి పేంచ్‌ ఎయ్యాల్నంటే మన పతంగిని కూడ ఆడిదాక దీస్కపోవాలే. అంటే పతంగిని పక్కపక్కపొంటి రోక్‌ కొట్టుకుంట ఓ పక్కకు వొంచి, నిమ్మలంగ ఆడిదాక ఏగ్రిచ్చుకుంట పోవాలన్నట్టు. ఇది ఉత్త ఆషామాషీ పనికాదు. పతంగుల్ల పహిల్వాన్‌ అసోంటోడైతనే చేశేటోడు. ఎన్కట యుద్దంల కానూన్లు పెట్టుకున్నట్టే పతంగుల ఏగ్రేసుట్ల కూడ కొన్ని కానూన్లుండేటియి. రెండు పతంగులు పోట్లాడుకుంటున్నప్పుడు మూడో పతంగి నడ్మిట్ల సొచ్చి ఆగం చేయోద్దు. అట్లనే పేంచ్‌ మాంజాలోనే ఎయ్యలగాని సాద దారంల ఏయ్యోద్దు.

మొండిపేంచ్‌లప్పుడు ఒక్కోసారి అవుతలోని పతంగని రబ్బరబ్బ గుంజుకొచ్చేటేది.. అట్ల చేయడాన్ని అత్తంబాజీ అంటరు. అంటే బలిమిటికి గుంజుకోవడమేనన్నట్టు.. ఈ అత్తంబాజీలతోటి మస్తు జగడాలు అయ్యేటియ్యి. అట్లనే పతంగి తేలిపోయి గాల్లే ఎగ్రుకుంట పోతున్నప్పుడు ఆ పతంగిని దొర్కవట్టి దెచ్చుకుంటే దాన్ని లుప్టాయించడం అంటరు. లుప్టాయించడం కూడా అందరికి రాదు.. అన్నట్టు ఒక్కోసారి పతంగి మన చేతుల్నుంచి తెగి పోతది. అసోంటప్పుడు దాన్ని ఉక్టాయించిందని అంటరు. అందుకే దారానికి ముల్లు ఒదలు కాకుంట గట్టిగేయ్యాలే. .. పతంగులు ఏగ్రేసేటప్పుడు ఒక్కోసారి అవి చెట్లకు, స్తంభాలకు తట్టుకుంటయి. కట్టెకు అందుతే తీసుకోవచ్చు. లేకుంటే మాత్రం దారానికి కొద్దిగా బరువున్న రాయిని కట్టి … ఆ రాయిని పతంగి దారంమీదికి ఇసిరి గుంజుతరు. అట్ల రాయిని కట్టిన దారాన్ని లండోరి అంటరు. ఈ పతంగుల సీజన్‌ల.. ముఖ్యంగా సంకురాత్రి పండుగ మూడు రోజులు మేడ మీద గోందు (బంక), గోందు లేకపోతే అన్నం, రంగు కాయితం కంపల్సరీ. ఎందుకంటే చినిగిపోయిన పతంగిని అంటియ్యాలే గద. పతంగికి ఉన్న బద్ద ఇర్గిపోతే దాన్కి బీడి కట్టి సపోర్ట్‌గా పెట్టేటోల్లు. పతంగి ఒక్కదిక్కున ఒరిగిపోతే దాన్ని కన్ను తినడమంటారు.. అలా కన్ను తింటుంటే బద్దుకు కాగితాలు చుట్టి బ్యాలెన్స్‌ చేసేటోళ్లం..

సంకురాత్రికే పతంగుల పోటీ మాజోరుగుంటది. తెల్లారుడే ఆల్శం ..మిద్దెలు,మేడలమీద మైకులు పెట్టేటోళ్లం. ఎవ్వరెవ్వరు పోటీ పడ్తున్నరు..? ఎవరి పతంగిని ఎవ్వరు కోసిండ్రు..? అయ్యన్ని మైకుల్నే రన్నింగ్‌ కామెంట్రీ చెప్పేటోళ్లం. నడ్మ నడ్మన పాటలు..చూశేటోల్లకు చీదర పుట్టకుంట అన్నట్టు. క్రికెట్‌ మ్యాచ్‌లునప్పుడు స్కోర్లు కూడా చెప్పేటోళ్లం.. అవతలోల్ల పతంగి కోశ్నప్పుడు కీకలు పెట్టి ఏగ్రేడు..దున్కుడు అబ్బో ఆ మజానే వేరుండేది. 79ల అయితే ఏడ చూసినా డాన్‌ పాటలే వినిపించేవి! పతంగుల్ల మస్తు రకాలుంటుండే మల్ల. . కడీకంప్‌, గోల్‌ కంప్‌ , అద్దా, పౌండ్‌, ఆదాపౌండ్‌, డోరాడార్‌, జీబ్యా, లంగోట్‌, లైంగా లంగోట్‌, జీబ్యా లంగోట్‌, జీబ్యా లైంగా లంగోట్‌, గుడ్డీ లంగోట్‌, గుడ్లందార్‌, నామందార్‌, పట్టిదార్‌, టోపీదార్‌, నామమ్‌దార్‌, రోటీదార్‌, షీషల్‌దార్‌, చొప్పన్‌, పచ్‌పన్‌, అదారోటీ, పచ్చీస్‌, గిల్లోరా. గిట్ల పేర్లుండబట్కెనే పతంగులను గుర్తుపట్టడం ఈజీ అయ్యేది.

ఎనకపంటి ఏ పతంగి వస్తుందో తెల్సుకోనీకే పనికొచ్చేది.. నిట్ట నిటారుగా ఎగ్రుతే కడీకంప్‌ అనేటోల్లు.. ఎగ్రేశేటోల్లు ఎట్ల వడ్తే అట్ల పతంగిని కంట్రోల్‌ చేస్తే దాన్ని గోల్‌ కంప్‌ అందురు. కడీకంప్‌ పతంగి పాపం మెత్తటి గుణమున్నది ఉంటుండే. దాన్ని ఎగ్రేశ్న తర్వాత మనం దారాన్ని దేన్కో ఓదాన్కి కట్టేసి ఇంటికి పోయి బువ్వకూడ తిని రావొచ్చు. అప్పటి దాక అది గాల్లనే ఏగ్రేది. అంటే అంత నమ్మకంగ ఉండేది. అంటే ఎవ్వని కన్ను దానిమీద పడకుంటనే . ఇగ పౌండ్‌ పతంగి మస్తు బర్వుంటుండే. దాన్ని ఎగ్రేసుడు అంటే బచ్చగాల్లతోటి కాదు. ఆటోలు గద డేకరేషన్‌ చేశ్నట్టు ఏక్దంగా సింగారిచ్చిన పతంగిని దుల్హానియ పతంగి అందరు. గిప్పటికీ ఈ పతంగులన్నిటిని గుర్తుపడతా! అప్పట్లో డోరడార్‌ పతంగి చారాణకు వచ్చేది! మామూలు పతంగి అయితే అయిదుపైసలే! చిన్న పతంగులయితే రూపాయికి 35 వచ్చేవి.. అన్నట్టు చెప్పుడు మర్సిన.. గోడలకు తేడా లేకుంట సున్నాలేసుడు లెక్క పతంగులకు కన్నాలు పెట్టుడు కూడా ఓ విద్దెనే. ఆ కళ అందర్కి ఉండేది కాదు.

పతంగులు ఏగ్రేసుట్ల మొనగాల్లైతే తప్పా కన్నాలు పెట్టుడు కరెక్ట్‌ రాకపోతుండే. బండికి బ్రేకులు..క్లచ్చులు, ఎక్స్‌లెటర్‌ ఎట్లనో.. పతంగికి కన్నాలు అట్ల.. అయ్యి సరిగ్గ లేకుంటే పతంగి మన మాటినది. అస్సలు ఎగ్రనని లండేషం ఏస్తది. కన్నాలు కట్టే కన్నయ్యలు దొర్కకపోతే కొత్తోల్లు బెత్తల లెక్కలేస్కుంట కట్టేటోల్లు. ఇగ పతంగి ఏగ్రేశేతందుకు ఉన్న ఇంకో ఇసిరే చర్ఖా.. ఇవి కూడా పైసలను బట్టి దొరికేది.. రంగులేసిన చర్ఖా అయిదు రూపాయల దాకా ఉండేడిది.. చర్ఖా లేనేళ్లో కోల్గెట్‌ టూత్‌పౌడర్‌ డబ్బాకు దారం చుట్టుకునేటోళ్లు.. చర్ఖాల దారం చుట్టుడు కూడ ఓ ఆర్టే. చర్ఖాకు ముందుగాలు కాయితం చుట్టేటోళ్లం.. అటెంక సాదా దారాన్ని చుట్టేటోళ్లం.. అప్పట్ల మధుర కోట్స్‌..మోడత్రెడ్‌ దారం శాన ఫేమస్‌ ఉంటుండే. 50, వంద మీటర్ల రీల్‌ పుడలు దొర్కేటియ్యి. దీన్ని కెయిట్‌ దారం అనేటోల్లం. బటర్‌ఫ్లై షేపుల ఉన్న అట్టకు చుట్టిన దారం కూడా దొరికేది.. దాన్ని మాంజా సుతాయించడానికి వాడేటోళ్లం.. పతంగుల సమరంల గెల్సిన పేరు ఎగ్రేశేటోల్లకు ఎట్లుంటదో.. చర్ఖా పట్టుకోనుటోనికి కూడ గంతే ఉండేది. గెల్సినోల్ల ఇద్దర్ని తురుముల్‌రా బై మీరు అని దోస్తుగాల్లంతదావతియ్యమని అడ్గుతుండే. ఎందుకంటే పేంచ్‌ ఏసేటప్పుడు చర్ఖా పట్టుకున్నోడు ఆగమాగమైతే పతంగి కాట్‌ అయి పోతది.

అందుకే శాన అలెర్టుతోటి హుషారుండాలే. డీల్‌ వదులుతున్నప్పుడు హోషియార్‌గా ఉండాలా! కీంచ్‌ గుంజుతున్నప్పుడు దారాన్ని సప్పసస్ప చుట్టాలా! మన పతంగి కాట్‌ అయినప్పుడు దారాన్ని రువ్వడిమీద చుట్టాలే. చిన్నప్పుడు అన్నలు పతంగులెగరేసేటప్పుడు చర్ఖా పట్టుకునే డ్యూటీ నాదే ఉండేడిది! పతంగి ఎగ్రేశేటప్పుడు చేతి వేల్లకు టేపు సుట్టుకునుడు, బట్టలు కుట్టే మిషిన్ల ఉండే బాబిన్ను ఏల్కి తొడుక్కునుడు కూడ చేశేటోళ్లం. లేకుంటే మాంజ కసక్‌మని కోస్తది.. ఇగ ఎండల ఏగ్రేస్తం గావట్టి కూలింగ్‌ గ్లాసులు, టోపీలు కూడ పెట్టుకునేటోళ్లం..కొందరు ఇస్టైల్‌ కోసం పెట్టుకుంటే కొందరు కండ్లల్ల ఎండ కొట్టకుంట పెట్టుకుందురు. ఇగిట్ల పతంగుల పండుగంటే ఇప్పటిలెక్క పోటోలకు పోజుల లెక్క ఉండకపోయేది.. రాత్రిపూట లైట్‌ పతంగిని కూడా ఎగరేశేటోళ్లం.. అప్పట్ల సర్ఫ్‌ పోడర్‌ డబ్బాలల్ల వచ్చేటిది.. ఆ డబ్బాను కట్‌ చేసి రంగు కాగితాలు అంటించేటోళ్లం.. లోపల ఓ మొంబత్తి ఎలిగించేటోళ్లం.. కొంచెం ఎగిరిన అదా పౌండ్‌ పతంగి దారానికి ఈ డబ్బాను ముడేశేటోళ్లం.. ఆ లైట్‌ కూడా మీదకు పోయేది..! చూశేటోళ్లకు అది చుక్కలా అగుపడేది.. సంక్రాంతి మూడు రోజులూ మిద్దెమీదనే ఉండేడిది! అన్నంవేళకు కిందకి దిగి జల్దీజల్దీ తిని మళ్లీ పైకిపోయేది! మధ్యాహ్నం ఇంట్లో ఉన్నవాళ్లంతా మేడెక్కేటోళ్లు.. చాయ్‌లు టిఫిన్లు పైనే! అదో టైమ్‌పాస్‌! పతంగుల ముచ్చట ఒడిష్నాక సెకండ్ షో సినిమాలకు పోయేటోళ్లం.. పతంగుల సంబరం సంక్రాంతితో ఆగేది కాదు.. దాపెట్టుకున్న పతంగులన్నీ ఎగరేసేతందుకు ఇంకో వారం దినాలు పట్టేది..

Read Also….  Makar Sankranti 2022: భోగి రోజున చిన్న పిల్లలకు రేగు పళ్ళను భోగి పళ్లుగా ఎందుకు పోస్తారు.. శాస్త్రీయకోణం ఏమిటంటే..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!