ఇతర రాష్ట్రాలకు విస్తరించిన ఆరోగ్య శ్రీ..ఎక్కడెక్కడ అంటే..?
విద్య, వైద్యం ఉన్నతంగా ఉంటే.. ఏ దేశమైనా సర్వతోముఖాభివృద్ది చెందుతోంది. ఆ దిశగానే పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ పేద ప్రజలకు వైద్యం అందించే విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. గత కొన్ని రోజులు క్రితం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ డెషీసన్ నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను జగన్ ఈ […]
విద్య, వైద్యం ఉన్నతంగా ఉంటే.. ఏ దేశమైనా సర్వతోముఖాభివృద్ది చెందుతోంది. ఆ దిశగానే పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ పేద ప్రజలకు వైద్యం అందించే విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. గత కొన్ని రోజులు క్రితం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ డెషీసన్ నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను జగన్ ఈ రోజు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా.. సుమారు 17 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు ఈ మూడు నగరాల్లోనూ ఏపీ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇందుకోసం సీఎం ఈ రోజు చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్ ఆసుపత్రుల డాక్టర్లు, అక్కడి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైద్య ప్రక్రియలు, అవంలభించాల్సిన విధివిధానాలు…సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలంటూ వైద్యులను కోరారు.