పబ్‌జీ గేమ్ కారణంగా చనిపోయిన జగిత్యాల యువకుడు
జగిత్యాల: తెలంగాణలో పబ్‌జీ గేమ్ ఆడుతూ ఒక యువకుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం రాజారాం పల్లెకు చెందిన 20 ఏళ్ల సాగర్ అనే కుర్రాడు అదే పనిగా పబ్‌జీ గేమ్ ఆడాడు. 45 రోజులుగా పబ్‌జీ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. దీంతో అతని మెడ నరాలు పట్టేశాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు రోజుల నుంచి చికిత్స పొందుతున్న అతను కోలుకోలేదు. నేడు తుదిశ్వాస […]
జగిత్యాల: తెలంగాణలో పబ్‌జీ గేమ్ ఆడుతూ ఒక యువకుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం రాజారాం పల్లెకు చెందిన 20 ఏళ్ల సాగర్ అనే కుర్రాడు అదే పనిగా పబ్‌జీ గేమ్ ఆడాడు. 45 రోజులుగా పబ్‌జీ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. దీంతో అతని మెడ నరాలు పట్టేశాయి.
వెంటనే కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు రోజుల నుంచి చికిత్స పొందుతున్న అతను కోలుకోలేదు. నేడు తుదిశ్వాస విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు, రాజారాం పల్లె వాసులు విషాదంలో మునిగిపోయారు.