AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మర్రి, రావి చెట్లకు పెళ్ళి!

ఇది పెనవేసుకుని పెరుగుతున్న ఓ మర్రి, రావి చెట్ల పెళ్లి కథ. ప్రణయ్ అనే మర్రి చెట్టుకు, దేబరతి అనే రావి చెట్టుకు ఆ ఊరి పెద్దలు పెళ్లి చేశారు. వేద మంత్రాల సాక్షిగా బెంగాళీ సాంప్రదాయంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్ళిని వీక్షించేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు పదిహేడు వందలకు పైగా అతిథులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. బెంగాల్‌లోని కోల్‌కతాకు 15 కిలోమీటర్ల దూరంలోని సొదేపూర్‌లో 12 ఏళ్ల  ప్రణయ్‌ను […]

మర్రి, రావి చెట్లకు పెళ్ళి!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 11:51 AM

Share

ఇది పెనవేసుకుని పెరుగుతున్న ఓ మర్రి, రావి చెట్ల పెళ్లి కథ. ప్రణయ్ అనే మర్రి చెట్టుకు, దేబరతి అనే రావి చెట్టుకు ఆ ఊరి పెద్దలు పెళ్లి చేశారు. వేద మంత్రాల సాక్షిగా బెంగాళీ సాంప్రదాయంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్ళిని వీక్షించేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు పదిహేడు వందలకు పైగా అతిథులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

బెంగాల్‌లోని కోల్‌కతాకు 15 కిలోమీటర్ల దూరంలోని సొదేపూర్‌లో 12 ఏళ్ల  ప్రణయ్‌ను దత్తత తీసుకున్న సొమనాగ్ అనే మహిళ ఈ పెళ్లి కోసం ప్రత్యేకంగా శుభలేఖలు అచ్చువేయించి ఊరంతా పంచింది. పెళ్లి సందర్భంగా ప్రణయ్‌ను దోతీకుర్తాతో అలంకరించారు. 10 ఏళ్ల దేబరతికి ఎర్ర రంగు బనారసీ చీర కట్టారు. ప్రణయ్‌కు సోమ, ఆమె భర్త సుప్రకాష్ నాగ్‌లు, దేబరతికి సునితీ సర్కార్, కమల్‌లు తల్లిదండ్రులుగా వ్యవహరించారు.

ఈ వేడుకపై పర్యావరణవేత్త సుభాష్ దత్తా మాట్లాడుతూ ‘‘ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు పచ్చదనంపై అవగాహన కలిగించేందుకు ఉపయోగపడతాయి. చెట్ల వల్ల ప్రయోజనాలు తెలుస్తాయి. ఈ రెండు చెట్లు రాత్రి వేళల్లో కూడా ఆక్సిజన్ అందిస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. ప్రజలు మరిన్ని చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలి’’ అని విన్నవించారు.

Follow Us
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?