చిత్తూరు జిల్లా మదనపల్లిలో లేడీ గెటప్‌తో మోసాలకు పాల్పడుతున్న పొత్తూరి మోహన కృష్ణమ్మ నాయుడు బండారం బయటపడింది. హనీ, మధుశ్రీ పేర్లతో పురుషులను ఆకర్షించి పెళ్లి పేరుతో దోచుకోవడమే గాక, గుప్తనిధులు, శాంతి పూజల పేరిట లక్షలు కొట్టేశాడు. రాజకీయ, పోలీసు అండతో ఇంతకాలం చెలామణి అయిన ఇతనిపై బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.