అందాన్ని పెంచే 6 కూరగాయలు.. మీ డైట్‌లో పక్కా ఉండాల్సిందే!

17 Jun 2026

Anand T

చిన్న వయస్సులోనే ముడతల చర్మంతో బాధపడుతున్నారా? అయితే ఈ 6 కూరగాయలను క్రమం తప్పకుండా తినడం రిజల్ట్స్ మీరే గమనిస్తారు.

మెరిసే చర్మానికి కూరగాయలు!

పాలకూరలో విటమిన్ సి, కాల్షియం,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం స్థితిస్థాపకతను,దృఢత్వాన్ని కాపాడతాయి.

పాలకూర

టమాటాలలో ఉండే లైకోపీన్, విటమిన్ సి చర్మాన్ని హానికరమైన సూర్యకిరణాలు, కాలుష్యం నుండి కాపాడతాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది

టమాటా

బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి.

బ్రోకలీ

క్యాప్సికమ్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంలోని తేమను కోల్పోకుండా కాపాడి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

క్యాప్సికమ్‌

పచ్చి బీన్స్‌లో విటమిన్ సి, బి విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి చర్మానికి లోపలి నుండి అవసరమైన పోషణను అందిస్తాయి.

బీన్స్

క్యారెట్లలోని బీటా-కెరోటిన్, విటమిన్ ఎ చర్మాన్ని యూవీ కిరణాల నుండి రక్షిస్తాయి. అలాగే ఇవి చర్మంపై వచ్చే మొటిమలను, వాపులను తగ్గిస్తాయి

క్యారెట్లు

ఈ కూరగాయల పూర్తి ప్రయోజనాలు లభించాలంటే.. వీటిని సలాడ్లు, సూప్‌లు, జ్యూస్‌ల రూపంలో లేదా కొద్దిగా ఉడికించి తీసుకోవడం మంచిది.

ఎలా తింటే మంచిది?