‘ఉల్లీ ! కొండెక్కి కూచున్నావ్ ! దిగిరావా ? ‘

దేశంలో మళ్ళీ ఉల్లిధరలు కొండెక్కి కూచున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల మాదిరే ఉల్లి ధరలు కూడా ఆకాశాన్నంటుతూ కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. దీని ధర కేజీ 70.. 80 రూపాయలు పెరిగిందంటే సామాన్యుడి నెత్తిన బండ పడినట్టే.. ఇది మునుముందు 100 రూపాయలు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఉల్లిలేనిదే కిచెన్ లో వంట లేదని గృహిణులు అంటుంటే.. అది లేని మీల్స్ వేస్ట్ అంటున్నారు ‘ ఉల్లి ప్రియులు ‘.. పైగా వచ్ఛేది పండుగల సీజన్ కూడా.. […]

'ఉల్లీ ! కొండెక్కి కూచున్నావ్ ! దిగిరావా ? '
Follow us

|

Updated on: Sep 26, 2019 | 2:02 PM

దేశంలో మళ్ళీ ఉల్లిధరలు కొండెక్కి కూచున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల మాదిరే ఉల్లి ధరలు కూడా ఆకాశాన్నంటుతూ కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. దీని ధర కేజీ 70.. 80 రూపాయలు పెరిగిందంటే సామాన్యుడి నెత్తిన బండ పడినట్టే.. ఇది మునుముందు 100 రూపాయలు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఉల్లిలేనిదే కిచెన్ లో వంట లేదని గృహిణులు అంటుంటే.. అది లేని మీల్స్ వేస్ట్ అంటున్నారు ‘ ఉల్లి ప్రియులు ‘.. పైగా వచ్ఛేది పండుగల సీజన్ కూడా.. మధ్య ప్రాచ్యంలోను, యుఎస్-చైనా టారిఫ్ వార్ టెన్షన్ల నేపథ్యంలోనూ.. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయన్నది ఓ అంచనా.. కాగా-మరోవైపు ఇండియాలో ఉల్లి పంటలకు పేరొందిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఏడాది భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. షాపులు, గోడౌన్లనుంచి ఉల్లిగడ్డలను దొంగలు దొంగిలించుకుపోతున్నారు. ఉల్లి లోడుతో వెళ్తున్న ట్రక్కులను అడ్డగించి దోచుకుంటున్నారు కూడా. బహుశా ఇప్పట్లో వీటి ధరలు తగ్గే సూచనలు లేవని, ప్రస్తుత పరిస్థితి నవంబరు వరకు కొనసాగవచ్ఛునని ఉల్లి వ్యాపారులు అంటున్నారు. బఫర్ స్టాక్ అయిపోయినప్పటికీ వీరు ధరలను ఇలాగే కొనసాగిస్తే స్టాక్ లిమిట్ పై పరిమితి విధించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ నెల 24 న హెచ్చరించారు. అయితే ఇది ఉల్లి రైతుల ప్రయోజనాలకు కూడా సంబంధించినది గనుక ‘ వెయిట్ అండ్ సీ ‘ అన్న పధ్ధతి పాటిస్తామని అన్నారు.

ఢిల్లీ వంటి నగరాల్లో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు నేఫెడ్ వంటి సంస్థలు కిలో ఉల్లి 22, 23 రూపాయల మధ్య విక్రయిస్తున్నాయి. . వీటికోసం ప్రజలు చాంతాడంత క్యూలలో పడిగాపులు పడక తప్పడంలేదు. ఈ నగరంలో ఉల్లి కేజీ 16 రూపాయలకు అమ్మేందుకు కేంద్రం రెడీగా ఉందని, నగర బీజేపీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయెల్ తెలిపారు. కానీ ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా సహకరించాలన్నారు. ఉల్లిపాయల బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించి ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత ఈ సర్కారుపై ఉందన్నారు. కేంద్రం అప్పుడే 50 వేల టన్నుల ఉల్లిని నిల్వ చేసిందని ఆయన తెలిపారు.కాగా-ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ద్వారా 30 మెట్రిక్ టన్నులతో కూడిన ట్రక్కులు పంజాబ్ సరిహద్దులకు చేరాయి. కస్టమ్స్ అధికారులు వీటికి క్లియరెన్స్ ఇచ్చారు. రానున్న రోజుల్లో మరిన్ని ట్రక్కులు వచ్ఛే అవకాశం ఉందంటున్నారు.2010 లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉల్లి సంక్షోభాన్ని అధిగమించేందుకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించి.. దిగుమతులపై పన్నును తగ్గించింది. పాకిస్తాన్ నుంచి వీటి దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2013 లో దీని క్రైసిస్ పై పార్లమెంటులో పెద్ద చర్చే నడిచింది. 1980 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం, 1998 లో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పడిపోవడానికి ‘ ఉల్లి ఘాటే ‘ కారణమంటే.. ఆబ్బో ! దీని ‘ యవ్వారం ‘ వేరే చెప్పాలా ?

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..