కోహ్లీ కన్నా ధోనీనే మిన్న.. సర్వే తేల్చిన నిజం!
సౌరవ్ గంగూలీ తర్వాత భారత్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. ఈ మాజీ కెప్టెన్‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ధోని ఇటీవల క్రికెట్‌కు దూరంగా ఉంటున్నా.. ఆయన్ని ఫ్యాన్స్ దేవుడుగా కొలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ధోనికే అభిమానగణం ఎక్కువ. తాజాగా బ్రిటన్‌కు చెందిన మార్కెటింగ్ పరిశోధన సంస్థ యుగోవ్ నిర్వహించిన సర్వేలో ధోని క్రేజ్ మరోసారి తేటతెల్లమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు […]

సౌరవ్ గంగూలీ తర్వాత భారత్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. ఈ మాజీ కెప్టెన్‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ధోని ఇటీవల క్రికెట్‌కు దూరంగా ఉంటున్నా.. ఆయన్ని ఫ్యాన్స్ దేవుడుగా కొలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ధోనికే అభిమానగణం ఎక్కువ. తాజాగా బ్రిటన్‌కు చెందిన మార్కెటింగ్ పరిశోధన సంస్థ యుగోవ్ నిర్వహించిన సర్వేలో ధోని క్రేజ్ మరోసారి తేటతెల్లమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులను భారత్‌లో ఎంతమంది అభిమానిస్తున్నారనే విషయంపై నిర్వహించిన సర్వేలో ధోని 8.58 శాతాన్ని సంపాదించాడు. అదీ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత స్థానాన్ని ధోని కైవసం చేసుకోవడం విశేషం. ఎప్పటిలానే నరేంద్ర మోదీ 15.66 శాతంతో టాప్‌లో ఉన్నారు.
కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 4.46 శాతాన్ని మాత్రమే సాధించి ఏడవ స్థానంలో ఉండటం గమనార్హం. రతన్ టాటా 8.02 శాతం, బరాక్ ఒబామా 7.36 శాతం, బిల్ గేట్స్ 6.96 శాతాన్ని కలిగి ఉండగా పోర్చుగీసు ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు భారత్‌లో 2.95 శాతం ఫ్యాన్స్ ఉండటం విశేషం. అటు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కూడా 2.32 శాతం సాధించాడు. 41 దేశాల్లోని 42 వేలమందిని ఆ సంస్థ సర్వేలో భాగస్వాములను చేసింది. పురుషులు, మహిళలను వేర్వేరుగా సర్వే చేశారు. ఇకపోతే మహిళల్లో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (10.36) టాప్‌లో నిలిచింది. క్రీడాకారుల జాబితాలో ధోని తర్వాత సచిన్ (5.81) నిలిచాడు. దీని బట్టి చూస్తే క్రికెట్‌కు దూరంగా ఉన్నా ధోనిని అభిమానించేవారి సంఖ్య మాత్రం తగ్గదని మరోసారి నిరూపితమైంది.