AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొంచి ఉన్న ముప్పు.. ట్రంపూ ! అభిశంసన తప్పదా ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముప్పు ముంచుకొస్తోంది. తనకు తిరుగులేదని విర్ర వీగుతున్న ఈ ‘ పెద్దన్న ‘ కు షాక్ ఇచ్ఛే పనిలో పడ్డారు డెమొక్రాట్లు.. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఓ తీర్మానాన్ని ఆమోదించి అభిశంసించేందుకు రంగం సిధ్ధమైంది. ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) లో ఈ అభిశంసన తీర్మానం నెగ్గడానికి సాధారణ మెజారిటీ ఉంటేచాలు.. ఆయనపై వఛ్చిన అభియోగాలను విచారించేందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటయింది. ఆయన ‘ ఇంపీచ్ […]

పొంచి ఉన్న ముప్పు.. ట్రంపూ ! అభిశంసన  తప్పదా ?
Anil kumar poka
|

Updated on: Sep 26, 2019 | 2:57 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముప్పు ముంచుకొస్తోంది. తనకు తిరుగులేదని విర్ర వీగుతున్న ఈ ‘ పెద్దన్న ‘ కు షాక్ ఇచ్ఛే పనిలో పడ్డారు డెమొక్రాట్లు.. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఓ తీర్మానాన్ని ఆమోదించి అభిశంసించేందుకు రంగం సిధ్ధమైంది. ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) లో ఈ అభిశంసన తీర్మానం నెగ్గడానికి సాధారణ మెజారిటీ ఉంటేచాలు.. ఆయనపై వఛ్చిన అభియోగాలను విచారించేందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటయింది. ఆయన ‘ ఇంపీచ్ మెంట్ ‘ కు అనువుగా డెమొక్రాట్లు తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ‘ ప్రాసెస్ ‘ మొదలుపెట్టారు. పైగా లాంఛనంగా విచారణ కూడా ప్రారంభమైంది. అయితే సెనేట్ లో విచారణ జరిగిన తరువాతే ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి వీలుంది. ప్రస్తుతానికి సింపుల్ గా అభిశంసించినంత మాత్రాన.. పదవి నుంచి ఆయనను తొలగించే పరిస్థితి లేనప్పటికీ.. ‘ ముప్పు ‘ మాత్రం సమీపంలో పొంచి ఉంది. గతంలో బిల్ క్లింటన్ తో బాటు.. 19 వ శతాబ్దంలో నాటి అధ్యక్షుడు ఏండ్రు జాన్సన్ పై కూడా అభిశంసన తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లదే మెజారిటీ.. ఈ హౌస్ లో మొత్తం 435 మంది సభ్యులుండగా.. 235 మంది డెమొక్రాట్లే. రిపబ్లికన్ అయిన ట్రంప్ మీద వీరంతా ఇంపీచ్ మెంట్ ప్రాసెస్ ప్రారంభించారు. ఈ మేరకు స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రకటన చేశారు. అయితే ఇది ‘ చెత్త ప్రతీకారమని ‘, ‘ వ్యర్థ ప్రయోగమని ‘ ట్రంప్ ‘ గారు ‘ కొట్టిపారేశారు. అసలు ఈయన అభిశంసనకు దారి తీసిన కారణాలేమిటని అనుకుంటే.. తాను మళ్ళీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేందుకు సహకరించవలసిందిగా ట్రంప్ గత జులై 25 న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదోమిర్ జెలెన్ స్కీ కి ఫోన్ చేసిన విషయం బయటపడడంతో అసలు కథ మొదలైంది. జెలెన్స్కీ నుంచి ఈయన ఫేవర్స్ కోరాడని ఆరోపిస్తూ ఓ అజ్ఞాత వ్యక్తి ఈ కాల్ విషయాన్ని బహిర్గతం చేశాడట. అమెరికా అధ్యక్ష పదవికి వచ్ఛే నవంబరులో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్ పైన, ఆయన కుమారుడు హంటర్ పైనా వఛ్చిన అవినీతి ఆరోపణలపైనా విచారణ జరిపించాల్సిందిగా ట్రంప్ సారు ఉక్రెయిన్ ప్రెసిడెంటును కోరాడట. ఆ ఎన్నికల్లో జో బిడెనే తనకు సరైన గట్టి ప్రత్యర్థి అని ఈయన భావిస్తుండడమే ఇందుకు కారణం. ఉక్రెయిన్ లో ఈ తండ్రీ కొడుకులిద్దరికీ వ్యాపార బిజినెస్ లు ఉన్నాయి. అమెరికా బయట మరో దేశంలో వీరిపై వఛ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిగినా అది ట్రంప్ విజయావకాశాలకే దోహదపడుతుంది. అందుకే ట్రంప్ ఈ ‘ ఎత్తు ‘ వేసినట్టు తెలుస్తోంది. ఏమైనా అజ్ఞాత వ్యక్తి ఇఛ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న డెమొక్రాట్లు దాన్ని ట్రంప్ అభిశంసనకు వినియోగించుకుంటున్నారు.

కాగా-ట్రంప్ అభిశంసన విషయం ట్రయల్ దశకు వచ్చేసరికి దాన్ని యుఎస్ లోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారించాల్సి ఉంటుంది. అందులో సెనేటర్లు జ్యురీ సభ్యులుగా ఉంటారు. సెనేట్ లో 100 మంది సభ్యులకు గాను 53 మంది రిపబ్లికన్లే ఉన్నారు. విచారణ ముగింపులో సెనేట్ లో మూడింట రెండు వంతులమంది ట్రంప్ దోషి అని తేల్చితే అప్పుడు ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. అయితే ఇంపీచ్ మెంట్ దశలో అమెరికా అధ్యక్షుడెవరూ పదవీచ్యుతుడు కాలేదు. వాటర్ గేట్ కుంభకోణం సమయంలో రిచర్డ్ నిక్సన్ ఈ ముప్పును ఎదుర్కొన్నా ముందే జాగ్రత్త పడి రాజీనామా చేసేశారు. ఏతావాతా ప్రస్తుతానికి ట్రంపులవారికి వచ్ఛే నష్టమేమీ లేకున్నా అమెరికా పార్లమెంటు చరిత్రలో ఆయన అభిశంసన విషయం ‘ పుటల్లోకి ‘ ఎక్కనుండడమే విశేషం.