క‌రోనాపై చ‌ర్య‌లు… ప్రభుత్వాలపై ప్రజల ఒపెనియ‌న్ ఏంటి..

కరోనా కట్టడిపై ఒక్కో దేశం ఒక్కో వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. వైరస్‌ నివారణకు తమ ముందున్న పద్దతులకు అనుగుణంగా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ 19 మహమ్మారిపై ఆ దేశాల్లోని ప్రజలు ఏమనుకుంటున్నారు..? తమ ప్రభుత్వాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయా ? లేదా ? అన్నదానిపై ప్రఖ్యాత గాలప్‌ ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ 17దేశాల్లో సర్వే నిర్వహించింది. అందులో ప్రజలు తమ ప్రభుత్వాల పనితీరును ముందుంచారు. వాటిలో భారత్‌, మలేషియా దేశాలు ముందు వరుసలో ఉండడం […]

క‌రోనాపై చ‌ర్య‌లు... ప్రభుత్వాలపై ప్రజల ఒపెనియ‌న్ ఏంటి..
Follow us

|

Updated on: Apr 29, 2020 | 3:38 PM

కరోనా కట్టడిపై ఒక్కో దేశం ఒక్కో వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. వైరస్‌ నివారణకు తమ ముందున్న పద్దతులకు అనుగుణంగా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ 19 మహమ్మారిపై ఆ దేశాల్లోని ప్రజలు ఏమనుకుంటున్నారు..? తమ ప్రభుత్వాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయా ? లేదా ? అన్నదానిపై ప్రఖ్యాత గాలప్‌ ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ 17దేశాల్లో సర్వే నిర్వహించింది. అందులో ప్రజలు తమ ప్రభుత్వాల పనితీరును ముందుంచారు. వాటిలో భారత్‌, మలేషియా దేశాలు ముందు వరుసలో ఉండడం విశేషం. ఈ రెండు దేశాల్లో 90శాతానికిపైగా ప్రజలు ఆయా దేశాలు తీసుకుంటున్న చర్యలను గట్టిగానే సమర్ధించాయని ఈ సర్వేలో వెల్లడి అయింది. కరోనా వైరస్‌ను మీ.. మీ ప్రభుత్వాలు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయా అన్న దానిపై నిర్మొహమాటంగా సమాధానమిచ్చారు. గత మార్చి చివరి వారంలో జరిపిన సర్వేకు ఈనెల ఏప్రిల్‌ 10వ తేదీ వరకు జరిపిన సర్వేలో కాస్త వ్యత్యాసాలు కనిపించాయి.

అర్జెంటీనాలో తొలి దశ జరగలేదు కాబట్టి అక్కడ ఎలాంటి రిజల్ట్స్‌ రాలేదు. కానీ ఈనెలలో మాత్రం బాగానే పనిచేస్తోందని అర్జెంటీనా ప్రజలు చెప్పారు. ఆస్ట్రియా, ఇండోనేషియా, కొరియా, థాయ్‌లాండ్‌, అమెరికాలో ఇంచుమించు గత నెలతో పాటు ఈ నెలలోనూ ప్రజలు తమ తీర్పును ఒకేవిధంగా చెప్పారు. తమ ప్రభుత్వాలు బాగానే చేస్తున్నాయని కితాబిచ్చారు. ఇక మీకు మీ కుటుంబంలోని సభ్యులకు ఎవరికైనా కరోనా సోకే అవకాశముందా అన్న దానిపై కూడా అవును కాదు అని తేల్చి చెప్పారు. ఇప్పటికే చాలా మంది కరోనావ్యాప్తికి కారణం అవుతున్నా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా మాత్రం చాలా మంది అవకాశముందంటే అవునని, లేదంటే కాదని చెప్పారు. ఇండియాలోనూ గత నెల, ఈనెలలో సేమ్‌ పర్సంటేజ్‌లో సమాధానాన్ని ఇచ్చారు. 10 మంది ఒకే అంటే ఈనెలలోనూ అంతే మంది అవును అన్న మాటే చెప్పారు. అర్జెంటీనా, జర్మనీ, జపాన్‌, స్విట్జర్లాండ్‌, అమెరికాలో గత నెలలో లేదు అని సమాధానం చెప్పిన వారు తక్కువగా ఉంటే..ఈ నెలలో మాత్రం పెద్దసంఖ్యలో సోకే ప్రమాదముందని ముందే సెలవిచ్చిన వారు ఉన్నారు. ఇక కరోనా నష్టాన్ని ప్రభుత్వాలు ఏమైనా ఎక్కువ చేసి చూపుతున్నాయా అన్న దానికి కూడా మనసులో మాటను బయటపెట్టారు. చాలా దేశాలు గతనెలలో ఎక్కువ అని చెప్పిన వాళ్లు ఈనెలకు వచ్చే సరికి మాత్రం అలా ఏం లేదని సమర్ధించుకున్నారు. ఆస్ట్రియా,ఇటలీలో మాత్రమే ఇంచుమించు సేమ్‌ చెప్పగా.. అర్జెంటీనా, ఇండియా, బల్గేరియా, కజికిస్తాన్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, స్విట్జర్లాండ్‌, థాయ్‌లాండ్‌, అమెరికాలో మాత్రం గతంలో ఎక్కువ అని చెబితే.. ఈ మంత్‌లో మాత్రం అదేం లేదన్నారు.

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??