Bodhan Passport Case: బోధన్‌ పాస్‌పోర్ట్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్‌

Bodhan Passport Case:  బోధన్‌ పాస్‌పోర్ట్‌ కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా కొనసాగుతోందని సీపీ సజ్జనార్‌ అన్నారు. పాస్‌పోర్ట్‌ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ...

Bodhan Passport Case: బోధన్‌ పాస్‌పోర్ట్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 23, 2021 | 5:42 PM

Bodhan Passport Case:  బోధన్‌ పాస్‌పోర్ట్‌ కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా కొనసాగుతోందని సీపీ సజ్జనార్‌ అన్నారు. పాస్‌పోర్ట్‌ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. బోధన్‌ పాస్‌పోర్ట్‌ మోసాల కేసులో 8 మందిని అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని సజ్జనార్‌ స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడు బంగ్లాదేశ్‌కు చెందిన పరిమళ్‌బైన్‌గా గుర్తించినట్లు చెప్పారు. ఒకే అడ్రస్‌పై 32 పాస్‌పోర్టులు జారీ అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. నిందితులు మొత్తం 72 పాస్‌పోర్టులు తీసుకున్నారని అన్నారు. అలాగే పాస్‌పోర్టుతో పాటు ఆధార్‌ కార్డులు కూడా తీసుకున్నారని వెల్లడించారు. అక్రమ పాస్‌పోర్టులు, వీసాలతో 19 మంది విదేశాలకు వెళ్లారని అన్నారు. ఈ పాస్‌పోర్టు మోసాల కేసును వేగవంతంగా దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. పరారీలో ఉన్న మిగతా వారిని కూడా పట్టుకుంటామని అన్నారు. ఈ కేసు విచారణలో ప్రత్యేక పోలీసు బృందాలు పని చేస్తున్నాయని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో నకిలీ పాస్‌పోర్టు వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. బోధన్ పట్టణానికి చెందిన కొందరు మీ సేవా నిర్వాహకులు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులకోసం కక్కుర్తి పడి వీరు నకిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరే బంగ్లాదేశీయులకు నకిలీ ఆధార్ కార్డులు తయారు చేయించి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. వీటిలో చాలా నకిలీవే అని పోలీసులు గుర్తించారు. ఇవే కాకుండా మరో 66 పాస్‌పోర్టుల అడ్రస్‌లపై కూడా ఫోకస్‌ పెట్టారు. నకిలీ ఆధార్‌ కార్డులతో పాస్‌పోర్టులు పొందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ముగ్గురు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, ఓ బ్రోకర్ ఈ స్కామ్‌లో కీలక సూత్రధారులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, నిజామాబాద్‌ జిల్లాలో బంగ్లాదేశ్ మూలాలున్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టారు. బోధన్‌ చిరునామాతో ఇద్దరు బంగ్లాదేశీయులు నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులు పొంది దేశం దాటే ప్రయత్నం చేస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడటం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

బోధన్ పట్టణానికి చెందిన కొందరు మీ సేవా నిర్వాహకులు అక్రమార్జన కోసం నికిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆసరా పింఛన్లు, భూముల దస్తావేజులు, రుణాలు పొందేందుకు బ్యాంకులకు సమర్పించే పత్రాలను నకిలీవి తయారు చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా పాస్‌పోర్టులు పొందడానికి బోగస్ ఆధార్ కార్డులను తయారు చేయడం వివాదాస్పదమవుతోంది. ఇలాంటి అక్రమార్కులు సులభంగా డబ్బు సంపాదన కోసం ఎంచుకున్న ఈ మార్గం దేశ భద్రతకే ముప్పు తీసుకొస్తోందని నిఘా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే బంగ్లాదేశీయులు బోధన్ టౌన్‌ను ఎందుకు సెంటర్‌గా చేసుకున్నారు? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: ఏవోబీలో కూంబింగ్‌ దళాలకు తప్పిన పెను ప్రమాదం.. మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాల గుర్తింపు