AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆరోగ్య తెలంగాణ’.. పీహెచ్‌సీల్లో ఇక 24 గంటల వైద్యం!

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పీహెచ్‌సీల పరిధిలో 24 గంటల వైద్యం అందించడంపై కూడా దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విస్తరించేందుకు రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సీహెచ్‌సీ) సౌకర్యాలు కల్పించనున్నది. రూ.70 కోట్ల నిధులతో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను అభివృద్ధిపరిచేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వైద్యంరంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ప్రజల […]

'ఆరోగ్య తెలంగాణ'.. పీహెచ్‌సీల్లో ఇక 24 గంటల వైద్యం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 25, 2019 | 5:15 PM

Share

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పీహెచ్‌సీల పరిధిలో 24 గంటల వైద్యం అందించడంపై కూడా దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విస్తరించేందుకు రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సీహెచ్‌సీ) సౌకర్యాలు కల్పించనున్నది. రూ.70 కోట్ల నిధులతో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను అభివృద్ధిపరిచేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వైద్యంరంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సర్కారు ఆస్పత్రుల ఆధునీకరణ, సేవల విస్తరణ వంటి అనేక నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.

కేసీఆర్ కిట్, డయాలసిస్ కేంద్రాలు వంటివి నిరుపేదలకు వైద్యసేవలను మరింత దగ్గర చేశాయి. ఇప్పుడు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా వైద్యసేవలు పొందేందుకు అవకాశం కలుగనున్నది. మెరుగైన వైద్య అందించడంతోపాటు రక్తం, మూత్ర పరీక్షలు వంటివి జరిపి రోగనిర్ధారణ చేసుకునేందుకు వీలుగా ల్యాబ్‌లను ఏర్పాటుచేయాలని చూస్తున్నది. ఇప్పటికే కొన్నికేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌సీలకు కావాల్సిన మందులు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి 12 అంశాలను నిర్ధారించుకుని వసతులు కల్పించేందుకు రూ.70 కోట్లు వినియోగించనున్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..