AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవిబిడ్డల ఆక్రందనలో మరో కేక..వైద్యం అందక తల్లీబిడ్డల మృతి

మన్యం గ్రామాల ప్రజల కష్టాలకు మరో సంఘటన సాక్ష్యంగా నిలిచింది. నిండు గర్బిణీ చావుకేక విని మన్యం చిన్నబోయింది. సకాలంలో వైద్యమందక తల్లీబిడ్డలు ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం జమదంగిలో చోటు చేసుకుంది. విశాఖ పాడేరు ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు పెదబయలు మండలం జమదంగి గిరుల్లో నివసించే అడవి బిడ్డలు.. వైద్యం కావాలంటే బోయితలి ప్రాంతానికి నడిచి వెళ్లాల్సిందే. సుమారు 20 కిలోమీటర్లు దూరం ఉన్న ఆ ప్రాంతానికి.. […]

అడవిబిడ్డల ఆక్రందనలో మరో కేక..వైద్యం అందక తల్లీబిడ్డల మృతి
visakhapatnam agency pregnant woman walks 20 km for medical treatment both mom and baby dies
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2019 | 5:07 PM

Share

మన్యం గ్రామాల ప్రజల కష్టాలకు మరో సంఘటన సాక్ష్యంగా నిలిచింది. నిండు గర్బిణీ చావుకేక విని మన్యం చిన్నబోయింది. సకాలంలో వైద్యమందక తల్లీబిడ్డలు ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం జమదంగిలో చోటు చేసుకుంది. విశాఖ పాడేరు ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు పెదబయలు మండలం జమదంగి గిరుల్లో నివసించే అడవి బిడ్డలు.. వైద్యం కావాలంటే బోయితలి ప్రాంతానికి నడిచి వెళ్లాల్సిందే. సుమారు 20 కిలోమీటర్లు దూరం ఉన్న ఆ ప్రాంతానికి.. లక్ష్మి అనే గర్భిణిని ఆమె కుటుంబీకులు నడిపించి తీసుకెళ్లారు. అంతా కొండ మార్గమే. ఎగుడు దిగుడు దారుల్లో ఆ ప్రయాణం అడుగడుగూ నరకప్రాయమే. ఆ దారిలో నడవలేక ఆ తల్లి ఎంత కష్టం పడి ఉంటుందో ఊహించుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు.

అయినా.. కడుపులో తన బిడ్డని త్వరలో చూడబోతునాన్న ఆనందంతో పంటి బిగువున బాధను భరిస్తూ ఒక్కో అడుగు సాగించింది. బోయితలికి వెళ్లి ఆర్ఎంపీ వైద్యుడికి చూపించుకుని.. తిరిగి అదే రీతిలో ఇంటికి బయల్దేరింది. ఇంకో 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఆమెకు పురుటి నొప్పులు పెరిగాయి. భరించలేకపోయింది. చేసేదిలేక.. డోలి కట్టి లక్ష్మిని ఇంటికి తీసుకెళ్లారు.. కుటుంబీకులు. అప్పటికే పరిస్థితి విషమించింది. లక్ష్మి ప్రసవించింది. తీవ్ర రక్తస్రావమైంది. అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు.. తల్లి కూడా ప్రాణం విడిచింది. గ్రామ ఉపాధ్యాయుడు దాసు బాబు ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. లక్షి, ఆమె బిడ్డల మరణ వార్త.. అడవిని దాటి బయటకు వచ్చేసరికి 5 రోజులు పట్టింది. చంద్రయాన్ 2 సక్సెస్ వంటి మిషన్స్ చూసి గర్వపడాలా? లేక వైద్యమందక ఇలాంటి అడవి బిడ్డల దారుణ మరణాలు చూసి సిగ్గుపడాలా?