వ్యాన్ లో మంటలు..డ్రైవర్ దూకేశాడు.. ఆ తరువాత.. ..

వ్యాన్ లో మంటలు..డ్రైవర్ దూకేశాడు.. ఆ తరువాత.. ..

చైనాలో ఈ నెల 20 న జరిగిన ఘటన ఇది.. యూబీ జిల్లాలోని పెట్రోలు స్టేషన్ ముందు ఆగిందో వ్యాన్.. అందులో పెట్రోలు పోయించుకునేందుకు డ్రైవర్ రెడీ అవుతూ కిందికి దిగబోయాడు. అంతే ! ఒక్కసారిగా ఆ వ్యాన్ లో మంటలు అంటుకున్నాయి. అది గమనించిన మనోడు వెంటనే విండో నుంచి దూకేశాడు. పొర్లుకుంటూ తన వాహనానికి దూరంగా వచ్ఛేశాడు. అతగాడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యేవాడు.ఇతని వాహనం మంటల్లో చిక్కుకోవడం, […]

Anil kumar poka

|

Aug 25, 2019 | 4:59 PM

చైనాలో ఈ నెల 20 న జరిగిన ఘటన ఇది.. యూబీ జిల్లాలోని పెట్రోలు స్టేషన్ ముందు ఆగిందో వ్యాన్.. అందులో పెట్రోలు పోయించుకునేందుకు డ్రైవర్ రెడీ అవుతూ కిందికి దిగబోయాడు. అంతే ! ఒక్కసారిగా ఆ వ్యాన్ లో మంటలు అంటుకున్నాయి. అది గమనించిన మనోడు వెంటనే విండో నుంచి దూకేశాడు. పొర్లుకుంటూ తన వాహనానికి దూరంగా వచ్ఛేశాడు. అతగాడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యేవాడు.ఇతని వాహనం మంటల్లో చిక్కుకోవడం, ఇతడు దానినుంచి దూకేయడం గమనించిన పెట్రోలు బంక్ సిబ్బంది వెంటనే కాపాడేందుకు పరుగులు పెడుతూ వచ్చారు. పైగా బంక్ లోని పెట్రోలు పాయింట్లను ఆఫ్ చేశేశారు. వారు ఒకవేళ ఆ పని చేయకపోయి ఉంటే భారీ అగ్నిప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు.. ‘ భయం భయంగా ‘ చెప్పారు. మొత్తానికి ఆ వాహన డ్రైవర్ సేఫ్.. అన్నట్టు… ఇది ఏనాటిదో డొక్కు వాహనమట. ఈ ఘటన జరగడానికి ముందే ఈ వాహనం నుంచి పెట్రోలు లీక్ అయిందని, అయినా పట్టించుకోకుండా నడుపుతూ వచ్చానని ఆ తరువాత ముఖాన చిరునవ్వు పులుముకుని ఈ డ్రైవర్ చెబుతుంటే పెట్రోల్ స్టేషన్ సిబ్బంది కళ్లప్పగించి వింటూ ఉండిపోయారు. చివరకు ఆ వాహనంపై నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు. ఏమైనా… ఈ ప్రమాదం తాలూకు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలు వ్యాన్ లో మంటలు ఎలా రేగాయో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu