AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Gardening: కొత్తిమీర ఏపుగా, సువాసనతో పెరగాలంటే.. ఒక్క గ్లాసు ఈ నీళ్లు పోస్తే చాలు..

వంట ఏదైనా సరే.. చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లితే ఆ రుచే మారిపోతుంది. విటమిన్ ఎ, సి, ఇ మరియు కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉండే కొత్తిమీర కేవలం సువాసనకే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ కొత్తిమీర నీటిని మరిగించి తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఇంతటి ఔషధ గుణాలున్న కొత్తిమీరను మార్కెట్లో కొనే పనిలేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే 6 సులభమైన దశల్లో ఎలా పెంచాలో ఈ కథనంలో చూద్దాం.

Kitchen Gardening: కొత్తిమీర ఏపుగా, సువాసనతో పెరగాలంటే.. ఒక్క గ్లాసు ఈ నీళ్లు పోస్తే చాలు..
Coriander Health Benefits Weight Loss
Bhavani
|

Updated on: May 16, 2026 | 5:01 PM

Share

ఇంట్లో మొక్కలు పెంచడం ఒక ఆర్ట్ అయితే.. కొత్తిమీరను పెంచడం చాలా ఈజీ. ధనియాల గింజలతో లేదా మార్కెట్ నుంచి తెచ్చిన కొత్తిమీర కాడలతోనే దీనిని సులభంగా పండించవచ్చు. అయితే, కొత్తిమీర మొక్కలకు ఎక్కువ ఎండ తగిలితే ఆకులు నల్లబడతాయని మీకు తెలుసా? మొక్కలు ఏపుగా పెరగడానికి ఎలాంటి మట్టిని వాడాలి, బియ్యం కడిగిన నీరు ఎలా ఉపయోగపడుతుందో వంటి ఆసక్తికరమైన గార్డెనింగ్ టిప్స్ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. సరైన స్థలాన్ని ఎంచుకోవడం కొత్తిమీర పెరగడానికి తీవ్రమైన సూర్యరశ్మి అవసరం లేదు. ఎక్కువ ఎండ తగిలితే ఆకులు మాడిపోయి, నల్లగా మారిపోతాయి. కాబట్టి, కొద్దిగా ఎండ తగిలే చల్లని  నీడ ఉన్న ప్రదేశంలో (సెమీ-షేడ్) కుండీలను ఉంచాలి.

2. మట్టి, సహజ ఎరువుల మిశ్రమం మొక్కలు బాగా పెరగాలంటే మంచి నాణ్యమైన ఇసుక లేదా మట్టిని ఎంచుకోవాలి. మట్టిలో సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు నాటడానికి ముందే మట్టిలో పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వంటి సహజ ఎరువులను బాగా కలపాలి.

3. కాడలు లేదా విత్తనాలు నాటడం

కాడల ద్వారా: బాగా పెరిగిన కొత్తిమీర మొక్క నుండి ఆరోగ్యకరమైన కాడలను కత్తిరించి నేరుగా ఇసుకలో నాటవచ్చు.

విత్తనాల ద్వారా: ధనియాల గింజలను కుండీలలో 5-7 అంగుళాల లోతులో నాటి, పైనుంచి మట్టిని తేలికగా కప్పాలి.

4. విత్తనాల మధ్య ఖాళీ విత్తనాలు లేదా నారుమొక్కలు నాటేటప్పుడు వాటి మధ్య కనీసం 6 నుండి 8 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వేర్లు బాగా విస్తరించి, ఆకులు గుబురుగా పెరగడానికి తగినంత స్థలం దొరుకుతుంది.

5. నీటి నిర్వహణ మట్టిలో ఎప్పుడూ తేమ ఉండేలా చూసుకోవాలి, కానీ ఎక్కువ నీరు పోసి ముద్దగా చేయకూడదు. నేరుగా నీళ్లు పోయడానికి బదులుగా చేత్తో తేలికగా నీటిని చిలకరించాలి. లేదా తడి గుడ్డను ఇసుకపై కప్పి తేమను కాపాడవచ్చు.

6. అదనపు పోషణ, రక్షణ మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత ఇంట్లో వృధాగా పారబోసే బియ్యం కడిగిన నీటిని వీటికి పోయాలి. ఇది మొక్కలకు అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలపై పలుచని కాటన్ గుడ్డను కప్పడం వల్ల ఆకులు వాడిపోకుండా ఉంటాయి. ఇలా చేస్తే ఒకటి లేదా రెండు నెలల్లోనే తాజా కొత్తిమీర చేతికి వస్తుంది.

Follow Us
మార్కెట్ కొత్తిమీర వద్దు.. ఇంట్లోనే కుండీలో కొత్తిమీర పెంచేయండిలా
మార్కెట్ కొత్తిమీర వద్దు.. ఇంట్లోనే కుండీలో కొత్తిమీర పెంచేయండిలా
96 ఏళ్లకు పుస్తకం పట్టి.. వందకు 98 మార్కులు సాధించిన బామ్మ గారు!
96 ఏళ్లకు పుస్తకం పట్టి.. వందకు 98 మార్కులు సాధించిన బామ్మ గారు!
ఊయల ఇంట్లో పెట్టుకోవచ్చా? శుభ–అశుభ వాస్తు రహస్యాలు!
ఊయల ఇంట్లో పెట్టుకోవచ్చా? శుభ–అశుభ వాస్తు రహస్యాలు!
10 నెలల మానసిక నరకయాతనలో 43 కుటుంబాలు..!
10 నెలల మానసిక నరకయాతనలో 43 కుటుంబాలు..!
NEET లీక్ కేసులో ఆ ఇద్దరివెనుక ఒకే మహిళ! ధనవంతుల పిల్లలే టార్గెట్
NEET లీక్ కేసులో ఆ ఇద్దరివెనుక ఒకే మహిళ! ధనవంతుల పిల్లలే టార్గెట్
ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి సూసైడ్.. ప్రేమ వైఫల్యమే కారణమా!
ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి సూసైడ్.. ప్రేమ వైఫల్యమే కారణమా!
పులి ఎదురైతే ఏం చేయాలి? నిజంగా మనుషులను తింటాయా? షాకింగ్‌ నిజాలు
పులి ఎదురైతే ఏం చేయాలి? నిజంగా మనుషులను తింటాయా? షాకింగ్‌ నిజాలు
ఊటీ పుష్పోత్సవంలో అద్భుత దృశ్యాలు, ప్రారంభ తేదీ వివరాలు..
ఊటీ పుష్పోత్సవంలో అద్భుత దృశ్యాలు, ప్రారంభ తేదీ వివరాలు..
ఆ హీరోలు రాత్రిళ్లు ఇంటికొచ్చి తలుపు కొట్టేవారు..
ఆ హీరోలు రాత్రిళ్లు ఇంటికొచ్చి తలుపు కొట్టేవారు..
ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?